రూ.3.50 కోట్లతో వైరస్ రిసెర్చ్ సెంటర్
కరోనా వ్యాప్తి నివారణకు మరిన్ని కట్టదిట్టమైన చర్యలు చేపట్టింది. చెన్నైలోని రాజీవ్‌గాంతీ ప్రభుత్వాస్పత్రిలో రూ.3.30 కోట్లతో వైరస్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసింది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులతో తమిళనాడు మూడు స్థానంలో కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో కరోనాతో మృత్యువాత పడుతున్నవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో తమిళ సర్కారు ఆందోళనలో పడింది. కరోనా వ్యాప్తి నివారణకు మరిన్ని కట్టదిట్టమైన చర్యలు చేపట్టింది. చెన్నైలోని రాజీవ్‌గాంతీ ప్రభుత్వాస్పత్రిలో రూ.3.30 కోట్లతో వైరస్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ ఆస్పత్రిలో వివిధ అంటువ్యాధులకు వైద్యపరీక్షలు చేస్తున్నారు. ఒకే సారి లక్ష మంది రక్తనమూనాలను సేకరించే సదుపాయం ఈ ఆస్పత్రిలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం కరోనా తీవ్రత అధికం కావడంతో పరిశోధనలు అధికంగా చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం రూ.3.30 కోట్లతో వైరస్ పరిశోధన కేంద్రం చేపట్టనున్నారు. ఇది త్వరలో అందుబాటులోకి రానుంది. దీంతో త్వరితగతిన కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి చికిత్స అందించేందుకు వీలవుతుందని అధికారులు భావిస్తున్నారు.