ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లు వద్దు..!
తల్లిదండ్రుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తమ పిల్లలను బడికి పంపించడానికి భయపడుతున్నారు. సెప్టెంబర్‌లో పాఠశాలలు తెరువాలన్న నిర్ణయంపై ఎక్కువశాతం
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తల్లిదండ్రుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తమ పిల్లలను బడికి పంపించడానికి భయపడుతున్నారు. సెప్టెంబర్‌లో పాఠశాలలు తెరువాలన్న నిర్ణయంపై ఎక్కువశాతం మంది తల్లిదండ్రులు వ్యతిరేకంగా ఉన్నారు. ఆన్‌లాక్ ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్ ఒకటి నుంచి పాఠశాలలు తెరుచుకోవచ్చని కేంద్రప్రభుత్వం స్పష్టంచేసింది.
స్కూల్స్ రీఓపెనింగ్ పై ‘లోకల్ సర్కిల్స్’ దేశవ్యాప్త సర్వే నిర్వహించింది. పాఠశాలలు తెరిస్తే ఎలా ఉంటుంది? ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణ మంచిదేనా? అసలు పాఠశాలల పునఃప్రారంభంపై తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు? అనే విషయాలపై సర్వే నిర్వహించింది. దానిపై ఇందులో ఎక్కువ మంది కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలలు తెరువకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. దేశంలోని 252 జిల్లాల్లో 25 వేల మంది తల్లిదండ్రులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 63% పురుషులు, 37% మహిళలు ఉన్నారు.
భారత్ లో ప్రస్తుతం రోజుకు సగటున 60 వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల ప్రకారం పిల్లలు హైరిస్క్ క్యాటగిరీలో ఉన్నారు. ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉన్న భారతదేశంలో పిల్లలను పాఠశాలలకు పంపిస్తే వారిద్వారా కుటుంబం మొత్తానికి వ్యాపించే ప్రమాదం లేకపోలేదని సర్వే పేర్కొంది.
Read More:
ఏపీలోని ఆ జిల్లాలో.. 50 ఏళ్లు పైబడిన వారికి.. నో హోమ్ ఐసోలేషన్..!