Breaking: రోడ్డు ప్రమాదంలో తెలుగు నిర్మాత దుర్మరణం

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. కేఎఫ్‌సీ నిర్మాణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌లలో ఒకరైన గుండాల కమలాకర్‌రెడ్డి బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.

Breaking: రోడ్డు ప్రమాదంలో తెలుగు నిర్మాత దుర్మరణం
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 19, 2020 | 5:07 PM

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. కేఎఫ్‌సీ నిర్మాణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌లలో ఒకరైన గుండాల కమలాకర్‌రెడ్డి బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కమలాకర్‌రెడ్డి తండ్రి నందగోపాల్‌రెడ్డి (75) కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా నల్లగొండ జిల్లా దామచర్ల మండలం కొండప్రోలు వద్ద ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రికుమారులు ఇద్దరూ మృత్యువాత పడటడంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కమలాకర్‌రెడ్డి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపారు. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా.. అంబులెన్స్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని అంబులెన్స్ డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల విడుదలైన ‘కనులు కనులు దోచాయంటే’ సినిమాను కేఎఫ్‌సి ఎంటర్‌టైన్మెంట్ సంస్థ తెలుగులో విడుదల చేసింది. ఈ సినిమాకు కమలాకర్‌రెడ్డి కో ప్రోడ్యూసర్‌గా వ్యవహరించారు. అటె తెలుగులో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు ‘అర్జున్‌రెడ్డి’, ‘ఎజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాలకు డిస్ట్రీబూటర్‌గా ఉన్నారు. తెలుగు, హిందీ, తమిళ డబ్బింగ్‌ సినిమాలకు కూడా ఆయన డిస్ట్రిబుటర్‌గా వ్యవహరించారు.