జగ్గయ్యపేటలో గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్న కానిస్టేబుళ్లు అరెస్ట్

వ‌స్తోన్న జీతం చాల్లేదో, లేక ప‌ట్టుకున్న నిషేధిత ప‌దార్థాల‌తో సొంత బిజినెస్ న‌డుపుదామ‌నుకున్నారో తెలీదు కానీ ఇద్ద‌రు ఖాకీలు ట్రాక్ త‌ప్పారు.

జగ్గయ్యపేటలో గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్న కానిస్టేబుళ్లు అరెస్ట్
Ram Naramaneni

|

Aug 19, 2020 | 5:18 PM

వ‌స్తోన్న జీతం చాల్లేదో, లేక ప‌ట్టుకున్న నిషేధిత ప‌దార్థాల‌తో సొంత బిజినెస్ న‌డుపుదామ‌నుకున్నారో తెలీదు కానీ ఇద్ద‌రు ఖాకీలు ట్రాక్ త‌ప్పారు. వేటినైతే అమ్మకాలు జ‌రప‌కుండా తమ‌కు డ్యూటీలు చేస్తున్నారో, వీరు ఆ బిజినెస్సే చేయ‌డం మొద‌లెట్టారు.

వివ‌రాల్లోకి వెళ్తే..జ‌గ్గయ్యపేటలో నిషేదిత గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్న ఎక్సైజ్ కానిస్టేబుళ్లు అరెస్ట్ అయ్యారు. జగ్గయ్యపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు చిలక భాస్కర్, పాత్య వెంకటేష్ నాయక్‌లు మరో ఇద్దరు వ్యక్తులతో కలసి జగ్గయ్యపేట ఆర్‌టీసీ కాలనీలో గుట్కా వ్యాపారం చేస్తూ పోలీసులకు పట్టుపడ్డారు. వారి వద్ద నుంచి 3 లక్షల విలువైన నిషేదిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు.

Also Read :

ఇసుక విధానంలో మార్పులు, మ‌రోసారి జ‌గ‌న్ మార్క్ నిర్ణ‌యాలు !

 దారుణం : కూతురి అభ్యంతకర చిత్రాలు ల్యాప్‌టాప్‌లో బంధించిన తండ్రి

అలెర్ట్ : ఉత్తర, తూర్పు తెలంగాణలో ఈ రోజు అతి భారీ వర్షాలు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu