గుండెపోటుతో వెటరన్ క్రికెటర్ మృతి
ప్రముఖ మాజీ క్రికెటర్ గోపాల స్వామి కస్తూరి రంగన్(89) కన్నుమూశారు. గుండెపోటుతో బుధవారం తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. ''రంగన్ ఇవాళ ఉదయం మృతి చెందారు. చామరాజపేటలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు''. ఈ విషయాన్ని...
ప్రముఖ మాజీ క్రికెటర్ గోపాల స్వామి కస్తూరి రంగన్(89) కన్నుమూశారు. గుండెపోటుతో బుధవారం తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. ”రంగన్ ఇవాళ ఉదయం మృతి చెందారు. చామరాజపేటలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు”. ఈ విషయాన్ని కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ జి కస్తూరి ట్రేజరర్, అధికార ప్రతినిధి వినయ మృత్యుంజయ అధికారికంగా పేర్కొన్నారు. మాజీ క్రికెటర్-అడ్మినిస్ట్రేటర్ అయిన రంగన్ కేఎస్‌సీఏ ఉపాధ్యక్షుడిగా, బీసీసీఐ క్యూరేటర్‌గానూ పని చేశారు.
1948 నుంచి 1963 మధ్య రంజీ ట్రోఫీలో మైసూర్ తరపున ఎక్కువగా మ్యాచ్‌లు ఆడారు. 1962-63లో కర్ణాటక ప్రాతినిథ్యం వహించారు. కుడిచేతి మీడియం బౌలర్‌గా రాణించారు. కస్తూరి రంగన్ మృతికి మాజీ క్రికెటర్లు సంతాపం ప్రకటిస్తున్నారు. క్రికెట్ అభివృద్ధికి ఆయన ఎంతో సేవ చేశారని మాజీ కెప్టెన్, కోచ్ అనిల్ కుంబ్లే ట్వీట్ చేశారు.
Also Read:
Kushboo Eye Injury : ప్రముఖ నటి కుష్బూ కంటికి గాయం
మెట్రో ఉద్యోగుల జీతభత్యాల్లో 50 శాతం కోత
నటి శివ పార్వతికి కరోనా పాజిటివ్.. ఎవరూ పట్టించుకోలేదంటూ ఆవేదన!