ఇసుక విధానంలో మార్పులు, మ‌రోసారి జ‌గ‌న్ మార్క్ నిర్ణ‌యాలు !

ఇసుకకు సంబంధించి వ‌స్తోన్న రిమార్క్స్‌ సాల్వ్ చేసే ప‌నిలో ఉంది ఏపీ స‌ర్కార్. రాష్ట్రంలో కొన్ని చోట్ల నాణ్య‌త లేని ఇసుక స‌ర‌ఫ‌రా అవుతుంద‌ని ఫిర్యాదులు వ‌స్తోన్న నేప‌థ్యంలో దిద్దుబాటు చ‌ర్య‌లు ప్రారంభించింది.

ఇసుక విధానంలో మార్పులు, మ‌రోసారి జ‌గ‌న్ మార్క్ నిర్ణ‌యాలు !
Follow us

|

Updated on: Aug 19, 2020 | 7:49 AM

ఇసుకకు సంబంధించి వ‌స్తోన్న రిమార్క్స్‌ సాల్వ్ చేసే ప‌నిలో ఉంది ఏపీ స‌ర్కార్. రాష్ట్రంలో కొన్ని చోట్ల నాణ్య‌త లేని ఇసుక స‌ర‌ఫ‌రా అవుతుంద‌ని ఫిర్యాదులు వ‌స్తోన్న నేప‌థ్యంలో దిద్దుబాటు చ‌ర్య‌లు ప్రారంభించింది. వినియోగదారుడు నేరుగా ఇసుక స్టాక్ పాయింట్లకు వెళ్లి ఇసుకను ప‌రిశీలించి తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది స‌ర్కార్. దీనిపై అధికారులు వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారు. కొత్తగా ప్రారంభం అవ్వ‌నున్న‌ ఇసుక కార్పొరేషన్‌లో ఈ రూల్స్ అమలు చేయాలని భావిస్తున్నారు.

స‌హ‌జంగా ఎటువంటి నిర్మాణాలు చేప‌ట్టినా క‌ట్టుబ‌డికి, ప్లాస్టింగ్‌కు వేర్వేరు ర‌కాల ఇసుక అవ‌స‌రం అవుతుంది. అయితే ప్ర‌స్తుత అన్‌లైన్ విధానంలో ఇసుక బుక్ చేసుకుంటే..అక్క‌డ అందుబాటులో ఉన్న ఇసుక పంపుతున్నారు. దీంతో వినియోగ‌దారుడికి ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి. ఆర్డ‌ర్ చేసిన 72 గంట‌ల్లో ఇంటి వ‌ద్ద‌కు ఇసుక చేరాల్సి ఉన్నా, చాలా చోట్లు ఆల్య‌మ‌వుతుంది. స్టాక్ పాయింట్‌కు దగ్గ‌ర‌లో ఉన్న ఇళ్లకు ఇసుక తీసుకెళ్లేందుకు లారీ య‌జమానులు పెద్ద‌గా ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌డం లేదు. దీంతో ఈ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి నిబంధ‌న‌ల్లో మార్పులు చేయాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యించింది.

వినియోగదారుడే వాహనాన్ని స్టాక్ పాయింట్ వ‌ద్ద‌కు తీసుకొచ్చి తనకు అవ‌స‌ర‌మైన క్వాలిటీ ఇసుకను తీసుకెళ్లే విధానాన్ని అమలు చేయాల‌ని యోచిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇసుక కావాలని నమోదు చేసుకుంటే.. స‌ద‌రు వ్యక్తికి నిజంగా ఇసుక అవసరం ఉందా.. లేదా అనేది చెక్ చేయ‌నున్నారు. ఆ తర్వాతే ఇసుక సరఫరాకు ప‌ర్మిష‌న్ ఇస్తారు. దీనిపై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం వెల్ల‌డించే అవ‌కాశం ఉంది.

Also Read :

వారికి త‌క్ష‌ణ సాయంగా రూ.2 వేలు : ఏపీ స‌ర్కార్ ఉత్త‌ర్వులు

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేవారికి అలర్ట్