జేసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్

టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి ఊరట లభించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. ప్రభాకర్ రెడ్డికి కరోనా సోకిన నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా...

జేసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 19, 2020 | 6:31 PM

Bail granted to JC Prabhakar Reddy : టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి ఊరట లభించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. ప్రభాకర్ రెడ్డికి కరోనా సోకిన నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఎస్సీ, ఎస్టీ సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ఈ నెల 6వ తేదీన కడప సెంట్రల్ జైలు నుంచి బెయిల్ పై విడుదలైన జేసీ… బొందలదిన్నె వద్ద సీఐ దేవేంద్రకుమార్ తో వాగ్వాదానికి దిగారని, సీఐను కులం పేరుతో దూషించారనే ఆరోపణలతో ఆయనపై తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన మళ్లీ రిమాండుకు వెళ్లారు. జైల్లో ఉన్న ఆయనకు కరోనా సోకింది. కరోనాకు జేసీ ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతారో తెలియాల్సి ఉంది.