ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం.. బిల్లు కట్టలేదని..
దొరికిందే ఛాన్స్‌గా కరోనా వేళ దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్ ఆస్పత్రులకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్న తీరు మాత్రం మారడంలేదు. కరోనా రోగులకు వందల రూపాయల మందులిచ్చి లక్షల్లో బిల్లులు పిండుతున్నారు. మరోవైపు బిల్లు పూర్తి చెల్లించలేదని చక్కలు చూపిస్తున్నారు.
దొరికిందే ఛాన్స్‌గా కరోనా వేళ దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్ ఆస్పత్రులకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్న తీరు మాత్రం మారడంలేదు. కరోనా రోగులకు వందల రూపాయల మందులిచ్చి లక్షల్లో బిల్లులు పిండుతున్నారు. మరోవైపు బిల్లు పూర్తి చెల్లించలేదని చక్కలు చూపిస్తున్నారు. తాజాగా ఓ మహిళ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నా 4 రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. బిల్లు పూర్తిగా చెల్లించే వరకూ ఆమెను ఇంటికి పంపించేందుకు నిరాకరించింది ఓ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం.
పూణెలోని ఓ మురికివాడకు చెందిన 66 ఏళ్ల వృద్ధురాలు తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను పరీక్షించిన వైద్య సిబ్బంది కరోనా సోకిందని నిర్ధారించారు. దీంతో ప్రభుత్వం ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి రిఫర్ చేసేంది. అయితే, వ్యాధి పూర్తిగా తగ్గే నాటికి బాధితురాలు ఆస్పత్రికి రూ. 55 వేలు బాకీ పడింది. మొత్తం బాకీ చెల్లించి పేషెంట్‌ను తీసుకెళ్లాలంటూ ఆస్పత్రి యాజమాన్యం ఆమె బంధువులకు చెప్పింది. అయితే మిగిలిన మొత్తం ఇవ్వలేమంటూ ఆమె కుటుంబసభ్యులు చేతులెత్తేశారు. కరోనా దెబ్బకు కొన్ని నెలలుగా ఉన్న ఉపాధి కోల్పోయి ఎటువంటి ఆదాయం లేదని గోడు వెళ్లబోసుకున్నారు. ఇంత చెప్పినా ఆస్పత్రి నిర్వహకులు కనికరించలేదు. బాధితురాలని ఇంటికి పంపేందుకు నిరాకరించారు. దీంతో షాకైన కుటుంబసభ్యులు ఓ లాయర్ సాయంతో ముస్సిపల్ కార్పొరేషన్ ఉన్నతాధికారులను ఆశ్రయించారు. అధికారులు రంగంలోకి దిగడంతో లొంగిన ఆస్పత్రి యాజమాన్యం..బాకీ మొత్తాన్ని రద్దు చేసుకుని బాధితురాలిని ఇంటికి పంపించింది. ప్రభుత్వ ఉత్తర్వులను సైతం పట్టించుకోని ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.