ధైర్యమే బలం : కరోనాను జయించిన 103 ఏళ్ల వృద్ధుడు
కరోనా కంటే ముందు భయం చంపేస్తుంది. కరోనా వచ్చి ప్రమాదకరంగా ఉన్నా ధైర్యం బ్రతికిస్తుంది. అవును ఇప్పుడు అలాంటి సంఘటనలే ప్రపంచవ్యాప్తంగా బోలెడు చూస్తున్నాం.
కరోనా కంటే ముందు భయం చంపేస్తుంది. కరోనా వచ్చి ప్రమాదకరంగా ఉన్నా ధైర్యం బ్రతికిస్తుంది. అవును ఇప్పుడు అలాంటి సంఘటనలే ప్రపంచవ్యాప్తంగా బోలెడు చూస్తున్నాం. మాములుగా ఈ మహమ్మారి వైరస్ వయసు మీదపడిన వృద్ధులపైనే ఎక్కువగా బలి తీసుకుంటుందని వైద్యులు, నిపుణలు చెబుతున్నారు. అయితే కేరళలో 100 సంవత్సరాలు పైబడిన వృద్ధుడు కరోనాను జయించాడు.
103 ఏళ్ల వయసులోనూ.. కేవలం 20 రోజుల్లోనే కోవిడ్ బారి నుంచి కోలుకుని తన మాససిక స్థైర్యాన్ని చూపించాడు. తిరువనంతపురం జిల్లా అలువకు చెందిన పరీద్ (103) జులై 28న తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడగా.. టెస్టులు చేసి, కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు వైద్యులు. అనంతరం చికిత్స కోసం ఎర్నాకులంలోని కలమస్సెరీ మెడికల్ కాలేజీకి తరలించారు. వయస్సు పైబడిన నేపథ్యంలో స్పెషల్ మెడికల్ టీమ్ పరీదుకు చికిత్స అందించింది. ఈ క్రమంలో ఆసుపత్రిలో చేరిన 20 రోజుల్లోనే ఆయన కోవిడ్ నుంచి కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. పరీదు మంగళవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆసుపత్రి డాక్టర్స్, స్టాఫ్ ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.
Also Read:
ఇసుక విధానంలో మార్పులు, మరోసారి జగన్ మార్క్ నిర్ణయాలు !
తెలంగాణ పోలీస్ శాఖలో సంచలనం : వరుస
దారుణం : కూతురి అభ్యంతకర చిత్రాలు ల్యాప్‌టాప్‌లో బంధించిన తండ్రి