Odd News: ‘ఆయన నా భర్త.. కాదు నా భర్త’.. నడిరోడ్డుపై ఇద్దరు మహిళల పంచాయితీ.. అంతలోనే బిగ్ ట్విస్ట్..!
టాలీవుడ్ మన్మధుడు, స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన ‘ఆవిడా మా ఆవిడే’ సినిమా గుర్తుందా? అందులో నాగార్జున ఇద్దరిని పెళ్లి చేసుకుని, వారిని మేనేజ్ చేయలేక ముప్పు తిప్పలు పడతాడు. అటు అర్చన(టబు), ఇటు ఝాన్సీ(హీరా రాజగోపాల్)ను మేనేజ్ చేసేందుకు నాగ్ పడే తిప్పలు..
టాలీవుడ్ మన్మధుడు, స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన ‘ఆవిడా మా ఆవిడే’ సినిమా గుర్తుందా? అందులో నాగార్జున ఇద్దరిని పెళ్లి చేసుకుని, వారిని మేనేజ్ చేయలేక ముప్పు తిప్పలు పడతాడు. అటు అర్చన(టబు), ఇటు ఝాన్సీ(హీరా రాజగోపాల్)ను మేనేజ్ చేసేందుకు నాగ్ పడే తిప్పలు.. ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి. అయితే, సినిమా కాబట్టి పెద్దగా పరాక్ లేదు. కానీ, నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితే వ్యక్తికి ఎదురైతే? అయితే, ఏంటి.. అయ్యింది కూడా. అవును, ఓ వ్యక్తిని ఇతను నా భర్త అంటే.. కాదు నా భర్త అని ఇద్దరు మహిళలు నడిరోడ్డుపై పంచాయితీకి దిగారు. నాలుగు రోడ్ల కూడలిలో ఈ గొడవ చిన్నపాటి సినిమాను తలపించింది. అక్కడి జనాలు అంతా వారిని గుమిగూడి.. ఏమైందో అర్థం కాక చూస్తూ నిల్చుండిపోయారు. ఇంతలో పోలీసులు ఎంట్రీ ఇవ్వడం, ఆ ముగ్గురినీ స్టేషన్‌కు చకచకా జరిగిపోయాయి. మరి ఇంతకీ ఆ ముగ్గురి మధ్య ఏం జరిగింది? అసలు కథ ఏంటి? అనేది పోలీసుల తెలిపిన వివరాలు చూద్దాం.
జార్ఖండ్‌లోని కొడెర్మాలో గల ఝుమ్రితిలయ్య ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఝుండా చౌక్ వద్ద ఇద్దరు మహిళలు ఓ వ్యక్తిని పట్టుకుని ఇతను నా భర్త అంటే నా భర్త అంటూ వివాదానికి దిగారు. వాస్తవానికి 2014లో సందీప్ రామ్‌నే వ్యక్తి దోమ్‌చాంచ్‌లోని గుడియా దేవితో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇతనికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. గుడియా దేవితో సంతోషంగా కాపురం సాగిస్తున్న సందీప్.. ఉపాధి కోసం ముంబైకి వలస వెళ్లాడు. అక్కడ ఓ హోటల్‌లో వంట మనిషిగా పని చేస్తున్నాడు. ఆ క్రమంలోనే పూజ అనే యువతితో ప్రేమలో పడ్డాడు. తన మొదటి భార్యకు తెలియకుండా పూజను పెళ్లి చేసుకున్నాడు. తాజాగా తన స్వస్తలానికి వచ్చిన సందీప్.. పూజను కూడా వెంట తీసుకువచ్చాడు. ఇంకేముంది.. మ్యాటర్ మొత్తం సందీప్ కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. సందీప్ వెంట పూజను చూసిన గుడియా.. ఆగ్రహంతో రగిలిపోయింది. ఈ పెళ్లికి అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది.
సందీప్ తనకు ఇద్దరూ కావాలని కోరుతుండగా.. పూజ అందుకు అంగీకరించింది. అయితే, గుడియా దేవి మాత్రం అందుకే అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దాంతో కేసు పోలీస్ స్టేషన్‌లోనే ఉండిపోయింది. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..