Rahul Gandhi: పీఎస్‌యూల్లో రెండు లక్షల ఉద్యోగాలు తీసేశారు.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణనలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల్లో కేంద్రం దాదాపు 2 లక్షల ఉద్యోగాలను తొలగించిందని వ్యాఖ్యానించారు. లక్షల మంది యువతల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణనలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల్లో కేంద్రం దాదాపు 2 లక్షల ఉద్యోగాలను తొలగించిందని వ్యాఖ్యానించారు. లక్షల మంది యువతల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది పెట్టుబడిదారల కోసం బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. గతంలో దేశానికే గర్వకారణమైన పీఎస్‌యూ ఉద్యోగాలకు ప్రస్తుతం ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. 2014లో పీఎస్‌యూల్లో 16.9 లక్షల ఉద్యోగాలు ఉండగా.. 2022లో అవి 14.6 లక్షలకు తగ్గిపోయాయని ఆరోపించారు. బీఎస్‌ఎన్‌ఎల్ లో 1.81 లక్షల ఉద్యోగాలు పోయాయని.. అలాగే సెయిల్, ఎంటీఎన్‌ఎల్, ఎఫ్‌సీఐ, ఓఎన్‌జీసీ లాంటి విభాగాల్లో వేలాది ఉద్యోగాలు పోయాయని తెలిపారు.
అధికారంలోకి వచ్చినప్పుడు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న కేంద్రం.. ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు తీసేసిందని ఆరోపించారు. అంతేకాకుండా వీటిల్లో కాంట్రాక్టు నియామకాలను రెండు రేట్లు పెంచితన్నారు. కాట్రంక్ట్ ఆధారంగా ఉద్యోగులను పెంచడం అనేది రాజ్యంగపరంగా రిజర్వేషన్ హక్కును హరించివేసినట్లు కాదా అంటూ విరుచుకుపడడ్డారు. ప్రభుత్వ సంస్థలు ప్రజలకు చెందిన ఆస్తులని.. దేశ వృద్ధిని సగమం చేయాలంటే వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం