AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heatwave: ప్రాణాలు తీస్తున్న ఎండలు.. హీట్‎వేవ్ తీవ్రత వల్ల 98 మంది మృతి..

నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇంకా వేసవి కాలం వెళ్లిపోలేదు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత మూడు రోజుల నుంచి హీట్ వేవ్ తీవ్రత వల్ల ఉత్తరప్రదేశ్, బిహార్  రాష్ట్రాల్లో దాదాపు  98 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.

Heatwave: ప్రాణాలు తీస్తున్న ఎండలు.. హీట్‎వేవ్ తీవ్రత వల్ల 98 మంది మృతి..
Heat
Aravind B
|

Updated on: Jun 18, 2023 | 3:39 PM

Share

నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇంకా వేసవి కాలం వెళ్లిపోలేదు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత మూడు రోజుల నుంచి హీట్ వేవ్ తీవ్రత వల్ల ఉత్తరప్రదేశ్, బిహార్  రాష్ట్రాల్లో దాదాపు  98 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఎండ తీవ్రతకు 54 మంది యూపీలో ప్రాణాలు కోల్పోగా.. 44 మంది బిహార్‌లో చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే జూన్ 15,16,17న ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో చాలా మంది ప్రజలు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది సహా ఇతర సమస్యలతో ఆసుపత్రికి పోటెత్తినట్లు అధికారులు తెలిపారు.

బాలియా జిల్లాలోని ప్రభుత్వాసుపత్రిలో దాదాపు 400 మంది చేరినట్లు పేర్కొన్నారు. చికిత్స తీసుకుంటున్నవారిలో ఎక్కవ మంది 60 ఏళ్ల పైబడిన వారే ఉన్నారని చెప్పారు. ఆస్పత్రిలో చేరిన వారందరూ కూడా పలు అనారోగ్యాలతో బాధపడుతున్నారని.. అధిక ఉష్ణోగ్రతల వల్ల వారి పరిస్థితి మరింత దిగజారిందని ప్రధాన వైద్య అధికారి డా.జయంత్ కుమార్ తెలిపారు. ఈ తీవ్రత వల్ల చాలామంది గుండెపోటు, విరేచనాలు, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా చనిపోయినట్లు పేర్కొన్నారు. శుక్రవారం రోజున బాలియా జిల్లాలో శుక్రవారం రోజున 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ అధికారులు తెలిపారు.

మరోవైపు బిహార్‌లో తీవ్రమైన హీట్‌వేవ్ వల్ల గడిచిన 24 గంటల్లో 44 మంది మృతి చెందారు. చనిపోయిన 44 మందిలో 35 మంది పాట్నాలోనే చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం రోజున ఈ రాష్ట్రంలో దాదాపు 11 జిల్లాల్లో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా.. పాట్నాలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఎండల తీవ్రత వల్ల జూన్ 24 వరకు పాట్నాలో పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఇతర జిల్లాల్లో కూడా విద్యాసంస్థలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జూన్ 18,19 న తీవ్రమైన హీట్‌వేవ్ వచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఔరంగాబాద్, రోటాస్, బోజ్‌పూర్, బుక్సార్ తదితర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో కూడా ఎండలు తీవ్రంగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం వేసవి సెలవులు జూన్ 30 వరకు పొడగించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం