జమ్మూకశ్మీర్‌లో గత నాలుగేళ్లలో ఎంతమంది జవాన్లు, సామాన్యులు చనిపోయారో తెలుసా? వివరాలు వెల్లడించిన కేంద్రం హోంశాఖ
Jammu And Kashmi: జమ్మూ కాశ్మీర్ నుండి ప్రతిరోజూ ఉగ్రవాద కార్యకలాపాల వార్తలు వస్తూనే ఉన్నాయి. జమ్మూలోని ఏదో ఒక చోటు ప్రతి రోజు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఉగ్రవాద..
Jammu And Kashmi: జమ్మూ కాశ్మీర్ నుండి ప్రతిరోజూ ఉగ్రవాద కార్యకలాపాల వార్తలు వస్తూనే ఉన్నాయి. జమ్మూలోని ఏదో ఒక చోటు ప్రతి రోజు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలలో సైన్యం, పోలీసులు, భద్రతా దళాల సిబ్బంది, సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకు ఎందరో వీర ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందారు. జమ్మూకశ్మీర్‌లో గత కొన్నేళ్లుగా ఉగ్రదాడుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ సైనిక సిబ్బంది, సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఉగ్రవాదుల కాల్పుల్లో ఎంత మంది చనిపోయారు. ఎంత మంది గాయపడ్డారో తెలుసుకుందాం.
అయితే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో శ్రీనగర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడులు, నక్సలైట్ల దాడుల్లో ఎంత మంది పౌరులు, కాశ్మీరీయేతరులు, మైనారిటీ వర్గాల ప్రజలు, సైనికులు ఎంత మంది మరణించారు.. ఎంత మంది గాయపడ్డారనే విషయాన్ని హోం శాఖ వెల్లడించింది. మణిపూర్. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2017 నుండి నవంబర్ 2021 వరకు ఇందకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
ఎంత మంది చనిపోయారు?
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2017 సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్ పోలీసు సిబ్బందితో సహా 80 మంది, 2018లో 91 మంది, 2019లో 80 మంది, 2020లో 62 మంది, నవంబర్ 2021 నాటికి 35 మంది భద్రతా బలగాలు మరణించారు. అలాగే 2017లో 226 మంది, 2018లో 238, 2019లో 140, 2020లో 106 మంది, 2021 (నవంబర్)లో జమ్మూ కాశ్మీర్ పోలీసు సిబ్బందితో సహా 86 మంది గాయపడ్డారు.
మరణించిన పౌరులు.. 2017లో 40 మంది, 2018లో 39, 2019లో 39, 2020లో 37, 2021 (నవంబర్)లో 40 మంది పౌరులు చనిపోయారు. అదే సమయంలో గాయపడ్డ వారు.. 2017- 2018లో 99 మంది గాయపడ్డారు. 2018లో 63, 2019లో 188, 2020లో 112, 2021 (నవంబర్)లో 72 మంది గాయపడ్డారు.
గాయపడ్డ వారు.. 13 నవంబర్ 2021న మణిపూర్‌లోని చురచంద్‌పూర్ జిల్లాలోని ఇండో-మయన్మార్ సరిహద్దులో అస్సాం రైఫిల్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు అస్సాం రైఫిల్స్ సిబ్బంది, ఇద్దరు పౌరులు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఆరుగురు సైనికులు కూడా గాయపడ్డారు.
దాడులను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఉగ్రవాదులు, నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ల సమయంలో భద్రతా బలగాలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ దాడులలో పౌరులు ఎవరూ గాయపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారని కేంద్ర హోం శాఖ తెలిపింది. టెర్రరిస్టు దాడుల నుంచి పౌరులను రక్షించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. గ్రౌండ్ వర్కర్లను గుర్తించడం, అరెస్టు చేయడం, రాత్రిపూట గస్తీలు, చెక్‌పాయింట్లు పెంచడం, భద్రతా బలగాలచే ఉన్నత స్థాయి నిఘా, ఉగ్రవాద నిధుల విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడం వంటివి ఉన్నాయి.
ఇవి కూడా చదవండి: