Professor Murder Case: హోటల్ గదిలో యూనివర్సిటీ ఫ్రొఫెసర్ అనుమానాస్పద మృతి.. హత్యా? ఆత్మహత్యా?
ప్రముఖ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న 44 యేళ్ల వ్యక్తి ఓ హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే ఎంతకూ లిఫ్ట్ చేయకపోవడంతో హోటల్ సిబ్బంది గది తలుపులు పగలకొట్టి చూడగా రక్తం మడుగులో విగతజీవిగా కనిపించాడు..
డెహ్రాడూన్, నవంబర్ 11: కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలోకి చెందిన ప్రొఫెసర్ ఉత్తరాఖండ్‌లోని ఓ హోటల్‌లో అనుమానాస్పదంగా మరణించి కనిపించాడు. మృతదేహంపై గాయాలు కనిపించడంతో పోలీసులు ఇది హత్యగా అనుమానిస్తున్నారు. మృతుడి చేతి మణికట్టు, గొంతు కోసి ఉన్న పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీకి చెందిన ఫిలాసఫీ ప్రొఫెసర్ అయిన మైనక్ పాల్ (44) ఇద్దరు స్నేహితులతో కలిసి ఉత్తరాఖండ్ ట్రిప్‌కు వెళ్లాడు. అయితే తన కుమార్తెను మిస్ అవుతున్నానని, కోల్‌కతాకు తిరిగి వెళ్లిపోతానని స్నేహితులతో చెప్పాడు. మరుసటి రోజు (శనివారం) ఉదయం ట్రైన్‌లో వెళ్లాలని నిశ్చయించుకున్న పాల్.. లాల్కువాన్‌లోని ఒక హోటల్‌లో బస చేశాడు. అయితే శుక్రవారం సాయంత్రం పాల్ కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా.. అతను ఫోన్‌కు స్పందించలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు హోటల్ సిబ్బందిని అప్రమత్తం చేశారు.
శుక్రవారం సాయంత్రం హోటల్‌కు సిబ్బంది రూమ్ డోర్ ఎంతసేపు కొట్టిన స్పందించలేదు. దీంతో వారు తలుపు పగలకొట్టి లోనికి వెళ్లారు. అక్కడ బాత్‌రూమ్‌లో ఆయన మృతదేహం కనిపించింది. చేతులు, మెడపై కత్తి గాయాలతోపాటు నేలపై రక్తం ఉండటం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు హాటల్‌కు చేరుకున్నారు. ప్రొఫెసర్ మైనక్ పాల్ సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ విషయం తెలియడంతో దవ్‌పూర్ యూనివర్శిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు షాక్ అయ్యారు. ఫిలాసఫీ ప్రొఫెసర్ అమిర ప్రొఫెసర్ మైనక్ పాల్ విద్యాబోధనలో తనదైన ముద్ర వేసుకున్నారని, ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఏంటని అంతా ఆశ్చర్యపోయారు. పాల్ కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీ పూర్వ విద్యార్థి. బెంగాల్‌లో రెండు కాలేజీల్లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించిన ఆయన ఇటీవల ప్రెసిడెన్సీ యూనివర్శిటీకి టీచర్‌గా చేరారు. 2022లో జాదవ్‌పూర్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా చేరినట్లు వెల్లడించారు.