Onion Price: ఉల్లి లొల్లి మళ్లీ మొదటికొచ్చే.. వారంలోనే రెండింతలు పెరిగిన ధరలు

కోయకుండానే ఉల్లి కన్నీరు పెట్టిస్తుంది. కేవలం వారం రోజుల్లోనే రెండు సార్లు ధరలు పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. పలు చోట్ల కిలో ఉల్లి వందకు చేరువలోకి చేరింది. గతంలో టమాట ధరలు అల్లాడించాయి. ఇప్పుడు దాని స్థానంలో ఉల్లి చేరిందని పలువురు వాపోతున్నారు..

Onion Price: ఉల్లి లొల్లి మళ్లీ మొదటికొచ్చే.. వారంలోనే రెండింతలు పెరిగిన ధరలు
Onion Price
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 10, 2024 | 10:32 AM

న్యూఢిల్లీ, నవంబర్‌ 9: గత కొంత కాలంగా నిత్యవసర ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అసలే అత్తెసరు ఆదాయంతో ఈసురోమంటూ కుటుంబాన్ని ఈదే సామాన్యుడు ఈ పెరిగిన ధరలతో బెంబేలెత్తిపోతున్నాడు. బియ్యం, పప్పు, ఉప్పుల ధరలు అందనంత ఎత్తులో ఉన్నాయి. దీనికి తోడు నిన్నమొన్నటి వరకు కురిసిన వర్షాలకు పంటలు కూడా వరునుడు ఎత్తుకుపోయాడు. దీంతో నిత్యవసర సరుకుల ధరలు మరింత పైపైకి ఎగబాకుతున్నాయి. ఓ పక్క పెరిగిన ధరలతో అల్లాడిపోతుంటే.. మరోవైపు టమాట, ఉల్లి ధరలు కూడా ఠారెత్తిస్తున్నాయి. వారం క్రితం కాస్త పర్లేదు అనేంతగా రూ. వందకు 4 కేజీల వరకు విక్రయించిన వ్యాపారులు హఠాత్తుగా ధరలు పెంచేశారు. కేవలం వారం రోజుల్లోనే రెండు సార్లు ధరలు పైకెగబాకాయి.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇదే తంతు కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు హోల్‌సేల్‌ మార్కెట్లలో రూ.40 నుంచి 60 వరకు పలికిన కిలో ఉల్లిపాయల ధర ఇప్పుడు రూ.70 నుంచి 80కి చేరింది. శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో రూ.80 కంటే అధిక ధర పలికడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ బడ్జెట్లు తల్లకిందులై వినియోగదారులు అల్లాడిపోతున్నారు. ఇక వ్యాపారులు మాత్రం ద్రవ్యోల్బణంతోపాటు ఉల్లి కొనుగోలు ధరలు పెరగడమే ఇందుకు కారణమని చెప్తున్నారు.

మండీల్లో కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.70కి పెరిగిందని, అమ్మకాలపై ప్రభావం చూపుతుండటం వల్లనే విక్రయాలు తగ్గాయని అంటున్నారు. అయినప్పటికీ ఉల్లిపాయలను జనం కొంటూనే ఉన్నారని ఢిల్లీ మార్కెట్‌లోని ఓ వ్యాపారి తెలిపారు. అదుపు లేకుండా పెరిగిపోతున్న ధరలపై వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లితోపాటు వెల్లుల్లి, టమాట ధరలు కూడా రెట్టింపు కావడంతో కొనుగోలుదారులు వాపోతున్నారు. పెరిగిపోతున్న ధరలకు ప్రభుత్వం కళ్లెం వేసి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!