Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో అపశృతి.. బైక్‌పై వెళ్తున్న పోలీస్‌పై జారిపడిన దిమ్మ! స్పాట్‌ డెడ్‌

నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి మీదకు క్రేన్ సహాయంతో అత్యంత బరువైన దిమ్మను చేర్చుతుండగా.. క్రేన్ చైన్లు తెగిపోయాయి. దీంతో దిమ్మ ఒక్కసారిగా కింద పడిపోయింది. అదే టైంలో అటుగా బైక్ పై వెళ్తున్న SIపై పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు..

Watch Video: రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో అపశృతి.. బైక్‌పై వెళ్తున్న పోలీస్‌పై జారిపడిన దిమ్మ! స్పాట్‌ డెడ్‌
Girder Falls From Under Construction Overbridge
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 08, 2024 | 1:00 PM

లక్నో, నవంబర్‌ 8: ఏ క్షణాన ఏం జరుగుతుందో.. ఎటునుంచి మృత్యువు ముంచుకొస్తుందో ఎవరికీ తెలియదు. అనుకోని రీతిలో మన చుట్టూ నిత్యం ఎన్నో దారుణాలు జరుగుతుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇటువంటి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓవర్‌బ్రిడ్జికి చెందిన బరువైన దిమ్మ క్రేన్‌ అనుకోకుండా కింద పడింది. సరిగ్గా అదే టైంకి బైక్‌పై వెళ్తున్న పోలీస్‌పై ఆ దిమ్మ పడింది. దీంతో తీవ్రగాయాలపాలై ఎస్‌ఐ అక్కడికక్కడే మరణించాడు. బైక్‌ వెనుక కూర్చొన్న మరో పోలీస్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో నకహా రైల్వే క్రాసింగ్ వద్ద ఓవర్‌బ్రిడ్జి నిర్మిస్తున్నారు. గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో 10 క్వింటాళ్ల బరువైన అల్యూమినియం గిడ్డర్‌ను క్రేన్‌ సహాయంతో వంతెనపైకి చేర్చేందుకు బిల్డర్లు ప్రయత్నించారు. అయితే ఉన్నట్టుండి క్రేన్‌ గొలుసులు తెగడంతో గిడ్డర్‌ కింద పడింది. సరిగ్గా అదే టైంలో కింద బైక్‌పై వెళ్తున్న పోలీస్‌పై ఆ దిమ్మ పడింది. దీంతో అతడు దాని కింద నలిగి అక్కడికక్కడే మరణించాడు. మృతుడిని ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చెందిన 45 ఏళ్ల విజేంద్ర సింగ్‌గా గుర్తించారు. బైక్‌ వెనుక సీట్లో కూర్చొన్న మరో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్ మానాయే కుందు తీవ్రంగా గాయపడ్డాడు. విజేంద్ర మీద పడిన గిడ్డర్‌ను అతి కష్టం మీద తొలగించగా.. అప్పటికే ఆయన మృతి చెందాడు. తీవ్రగాయాల పాలైన మానాయే కుందును హుటాహుటీగా BRD మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) సహా స్థానిక అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదం తర్వాత క్రేన్‌ ఆపరేటర్‌ అక్కడి నుంచి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. సింగ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే అత్యంత బరువైన గిడ్డర్‌ను వంతెనపైకి చేర్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం, ట్రాఫిక్‌ను నిరోధించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా గోరఖ్‌పూర్‌లో 76.28 కోట్ల వ్యయంతో 1,021 మీటర్ల పొడవైన ఓవర్‌బ్రిడ్జిని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్మిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.