AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: నాలుగేళ్ల కొడుకుతో కారు నడిపించిన తండ్రి.. క్షణాల్లో నిండు ప్రాణం బలి! భయానక వీడియో

సరదాకి చేశాడో.. తెలియక చేశాడో.. తెలియదుగానీ ఓ తండ్రి చేయరాని తప్పు చేశాడు. కారులో తన పక్కనే కూర్చోబెట్టుకుని తన నాలుగేళ్ల కుమారుడితో కారు నడిపించాడు. అంతే రోడ్డుపై ఆ కారు నానాభీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో..

Srilakshmi C
|

Updated on: Nov 10, 2024 | 11:02 AM

Share

చెన్నై, నవంబర్‌ 9: మైనర్‌తో వాహనాలు నడిపించడమే తప్పు అయితే.. ఓ వ్యక్తి ఏకంగా తన నాలుగేళ్ల బాబుకే స్టీరింగ్‌ చేతికి అప్పగించాడు. ఇంతలోనే కారు అదుపుతప్పింది. ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఈ దానేఫ ఘటన తమిళనాడులోని తిరుపత్తూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ తండ్రి తన నాలుగేళ్ల కుమారుడితో కారు నడిపించాడు. అదీ జన సంచారం ముమ్మరంగా ఉన్న ప్రాంతంలో.. దీంతో కారు ఒక్కసారిగా అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఇంట్లోకి వెళ్తున్న వృద్ధుడిపైకి కారు దూసుకెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటీజే క్లిప్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంటి ముందున్న గెటు వద్ద మెట్లు ఎక్కుతున్న వృద్ధుడిని కారు ఢీ కొట్టడం వీడియో కనిపిస్తుంది.

నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాలుడి తండ్రిని తిరుపత్తూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్‌తో వాహనాలు నడిపించడమే తప్పు అయితే ఏకంగా తన నాలుగేళ్ల కుమారుడికే స్టీరింగ్‌ అప్పగించడం మహా నేరమని, జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. చనిపోయిన వృద్ధుడిని ముత్తుగా గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..