AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Defamation Case: పరువు నష్టం దావా కేసు గెలిచిన మాజీ సీఎం.. రూ.1.10 కోట్ల పరిహారం..

రాజకీయ ప్రత్యర్థులపై నిజానిజాలతో సంబంధం లేకుండా కొందరు నేతలు ఆరోపణలు చేస్తుండడం చూస్తుంటాం. కొంతమంది వాటిని తిరిగి కౌంటర్ తో సమాధానమిస్తుంటే మరి కొంతమంది వాటిని లైట్ గా తీసుకుంటారు.. కానీ కొద్ది మంది మాత్రం సీరియస్ గా తీసుకొని న్యాయపరమైన చర్యలు దాకా వెళుతుంటారు. పరువు నష్టం దావా కేసులు వేస్తుంటారు మనం చూస్తూనే ఉంటాం.

Defamation Case: పరువు నష్టం దావా కేసు గెలిచిన మాజీ సీఎం.. రూ.1.10 కోట్ల పరిహారం..
Madras High Court
Ch Murali
| Edited By: Janardhan Veluru|

Updated on: Nov 10, 2024 | 10:50 AM

Share

రాజకీయ ప్రత్యర్థులపై నిజానిజాలతో సంబంధం లేకుండా కొందరు నేతలు ఆరోపణలు చేస్తుండడం చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లో ఈ ఆరోపణల తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది.  కొంతమంది వాటిని తిరిగి కౌంటర్ తో సమాధానమిస్తుంటే మరి కొంతమంది వాటిని లైట్ గా తీసుకుంటారు.. కానీ కొద్ది మంది మాత్రం సీరియస్ గా తీసుకొని న్యాయపరమైన చర్యలు దాకా వెళుతుంటారు. పరువు నష్టం దావా కేసులు వేస్తుంటారు మనం చూస్తూనే ఉంటాం. అలానే ఓ మాజీ ముఖ్యమంత్రి తన ప్రతిష్టకు భంగం కలిగిందంటూ ఓ నిందితుడి కుటుంబం పై పరువు నష్టం దావా కేసు వేశారు విచారించిన హైకోర్టు మాజీ ముఖ్యమంత్రికి అనుకూలంగా తీర్పుని ఇచ్చింది. భారీగా పరిహారం చెల్లించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.. ఇంతకీ ఏంటా కేసు.. ఎవరా మాజీ ముఖ్యమంత్రి తెలుసుకుందాం.

తమిళనాడులో కొడనాడు పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత. కొడనాడు లో జయలలితకు వేలాది ఎకరాల్లో టీ ఎస్టేట్ ఉంది. ఎస్టేట్లో ఏడాదిలో ఎక్కువ రోజులు అప్పట్లో జయలలిత ఇక్కడే బస చేసేది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ నుంచి పరిపాలన కొనసాగించేది. సచివాలయంలో ఉండే మన అధికారులు మొత్తం అక్కడే ఉంటూ అక్కడ నుంచే పరిపాలన సాగేది. అప్పట్లో ప్రతిపక్షాలు తమిళనాడులో ప్రభుత్వ పరిపాలనంత ఫామ్ హౌస్ నుంచే జరుగుతుందని తమిళనాడులో కొడనాడు పరిపాలన జరుగుతోందని పదేపదే విమర్శించేవారు.

వేలాది ఎకరాల మధ్యలో విలాసవంతమైన భవనం అలాగే ఐఏఎస్ అధికారుల కోసం ప్రత్యేక భవనం కూడా అక్కడ ఉంది సీఎం గా ఉన్నప్పుడు హెలికాప్టర్లో ల్యాండ్ అయ్యేందుకు ప్రత్యేక హెలిప్యాడ్ ని కూడా అప్పట్లో అక్కడ సిద్ధం చేశారు. జయలలిత మరణం తర్వాత ఆ ఎస్టేట్ పై అందరి కళ్ళు పడ్డాయి. ఎస్టేట్లోని జయలలిత నివాసం ఉండే ఆ భవనంలో పైకి మూడంతస్తుల కనిపించిన లోపల మరో మూడు అంతస్తులు ఉన్నాయని వాటిలోనే నేలమాలయలు అపారమైన సంపద ఉందని ప్రచారం జరిగింది. ఆ సంపద కోసం అప్పట్లో దోపిడీలు హత్యలు జరిగాయి. 2016లో జయలలిత మరణం తర్వాత ఆరు నెలల్లో అక్కడ ఆ పరిసరాల్లో దాదాపు 7 హత్యలు జరిగాయి. కొడనాడు ఎస్టేట్ సెక్యూరిటీ గార్డ్ అలాగే జయలలిత మాజీ డ్రైవర్ సహా వరుసహత్యల్లో హతమయ్యారు. ఈ కేసులో కీలక నిండుతుడుగా మార్టిన్ ను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్టేట్ లోని భవనంలో బంగారం నగదు దోపిడీ కోసం కేరళలోని ముఠాతో కలిసి మార్టిన్ ఈ హత్యలు చేశాడని అభియోగాలు ఉన్నాయి.

ఈ ఘటనలు జరిగిన సమయంలో సీఎంగా ఎడపాడి పళని స్వామి ఉన్నారు. పళని స్వామి ఈ హత్యలన్నీ చేయించారని.. జయలలిత సంపద కొల్లగొట్టేందుకే ఆయన ఈ నేరాలకు పాల్పడ్డారని నిందితుడు మార్టిన్ సోదరుడు ధనపాల్ ఆరోపించారు. మీడియాలో అప్పట్లో ధనపాల్ ఆరోపణలు సంచలనంగా మారాయి. కొడనాడులో సంపద కొల్లగొట్టడం కోసం అప్పట్లో సీఎం గా ఉన్న పళని స్వామి ఈ హత్యలు చేయించి ఉంటారని చాలామంది నమ్మిన పరిస్థితులు కూడా ఉంది. అయితే  ఈ ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న పళని స్వామి కోర్టులో పరువు నష్టం దావా కేసు వేశారు. ఆరేళ్ల పాటు జరిగిన విచారణలో తాజాగా మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. జస్టిస్ ఆర్ ఎం టి టీకా రామన్ ధనపాల్ మాజీ ముఖ్యమంత్రి పళని స్వామికి రూ.1.10 కోట్ల పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. నిందితుడు కుటుంబం చేసిన ఆరోపణల కేసులో పరిహారం చెల్లించాల్సి రావడం ఆ పరిహారం అందుకునేది మాజీ సీఎం కావడం ఈ రెండు కూడా అరుదుగా ఉంటుందని చెప్పొచ్చు.