Jammu and Kashmir: ఎమ్మెల్యేలు ఫైటింగ్.. రణరంగంలా జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ.! వీడియో వైరల్

Jammu and Kashmir: ఎమ్మెల్యేలు ఫైటింగ్.. రణరంగంలా జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ.! వీడియో వైరల్

Anil kumar poka

|

Updated on: Nov 10, 2024 | 1:11 PM

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ సమావేశం రణరంగంలా మారింది. రెండోరోజు సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయ్యింది. ఆర్టికల్ 370పై ఎన్సీ వర్సెస్‌ బీజేపీ సభ్యులు రగడ జరుగుతోంది. ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తూ పీడీపీ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా..ఆ తీర్మానంపై అభ్యంతరం చెబుతూ బీజేపీ సభ్యులు ఆందోళన దిగారు. గందరగోళ మధ్య సభ వాయిదాలు పడుతూ వచ్చింది.

కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ప్రత్యేక హోదాను పునరుద్ధరించే తీర్మానాన్ని జమ్ముకశ్మీర్‌ ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి అసెంబ్లీలో నిన్న ప్రవేశపెట్టారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం ఎన్నికైన ప్రజా ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలి’ అని ఆ తీర్మానం ప్రవేశపెట్టగా.. బీజేపీ ఎమ్మెల్యేలు, సభలో ప్రతిపక్ష నేత సునీల్ శర్మ ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు. ఈ తీర్మానం ప్రతులను బీజేపీ సభ్యులు చించారు. పేపర్‌ ముక్కలను వెల్‌లోకి విసిరారు. లంగేట్ ఎమ్మెల్యే షేక్ ఖుర్షీద్ వెల్ లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు. అయితే ఈ గందరగోళం మధ్య స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్ ఈ తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించారు. అసెంబ్లీలోని మెజారిటీ సభ్యులు దీనికి మద్దతిచ్చారు. దీంతో ఈ తీర్మానాన్ని సభ ఆమోదించింది. 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్, లడఖ్ గా విభజించారు. మోదీ సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయాల్లో ఇదొకటిగా నిలిచింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.