Seaplane: సీ ప్లేన్.. అదిరిపోయిన ఏపీ ప్లాన్.! దేశంలో ఫస్ట్ టైమ్ ఏపీ లోనే సీ ప్లేన్ సర్వీస్..
ఇలా నీటిపై కదులుతూ.. అలా గాల్లోకి ఎగురుతూ.. మళ్లీ నీటిపైనే ల్యాండ్ అయ్యే జల విమానం ఇది. ఇంతవరకు మన దేశంలో ఎక్కడా లేదు. భారత్ లో ఫస్ట్ టైమ్.. ఏపీలోనే టేకాఫ్.. ఏపీలోనే ల్యాండింగ్. జస్ట్.. అరగంటలో విజయవాడ నుంచి శ్రీశైలం జర్నీని కంప్లీట్ చేసేసింది. ఒక విమానం.. గాల్లోకి ఎగరాలన్నా.. భూమిపై ల్యాండ్ కావాలన్నా.. దానికి దాదాపు ఐదు వందల ఎకరాల ఎయిర్ పోర్ట్.. రన్ వే అవసరం. కానీ ఈ సీ ప్లేన్ స్పెషల్ ఏమిటో తెలుసా.?
నీళ్లుంటే చాలు.. టేకాఫ్, ల్యాండింగ్ అన్నీ దానిపైనే. అందుకే.. ఏపీ టూరిజం రంగానికి.. ఇంకా చెప్పాలంటే ఇండియా టూరిజానికే ఇది గేమ్ ఛేంజర్ కాబోతోంది అని క్లియర్ గా చెప్పచ్చు. దేశంలోనే సీ ప్లేన్ సర్వీస్ ను తొలిసారిగా ఏపీ నుంచి స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి ఇది డెమో మాత్రమే. అంటే ఓ ట్రైలర్ లాంటిది. అసలు కథ ముందుంది. ఎందుకంటే.. ఏ దేశానికైనా, రాష్ట్రానికైనా టూరిజం అనేది చాలా ముఖ్యం. మాల్దీవులు వంటి దేశాలు.. కేవలం పర్యాటకం మీదే ఆధారపడి బతుకుతున్నాయి. అందుకే భవిష్యత్తులో ఏ ఇజం ఉండదు.. టూరిజం తప్ప అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అంత ఘంటాపథంగా చెప్పగలిగారు. పైగా ఇతర రంగాలతో పోలిస్తే టూరిజంలో వచ్చే ఆదాయం చాలా ఎక్కువ. దీని మీద చేసే ఖర్చుతో పోలిస్తే.. ఆదాయం దాదాపు ఆరు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే రూపాయి ఖర్చు పెడితే.. సుమారు ఆరు రూపాయల ఆదాయం అన్నమాట. అలాంటి బంగారు బాతును ఎవరు వదులుకుంటారు? అందుకే ఇప్పుడు ఇంత వేగంగా.. దేశంలోనే ఫస్ట్ టైమ్.. సీ ప్లేన్ సర్వీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గాల్లో ఎగిరేలా చేశారు. ఎయిర్ పోర్ట్ కట్టాలంటే.. వందలాది ఎకరాలు సేకరించాలి. మౌలిక వసతులు కల్పించాలి. కానీ సీ ప్లేన్స్ కు అవేవీ అవసరం లేదు. ఏరో డ్రోమ్స్ సాయంతో ఎయిర్ ట్రావెల్ చేయచ్చు. ఇక ఉడాన్ స్కీమ్ వయబిలిటీ గ్యాప్...
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

