AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun’s Pushpa 2: చెమట్లు పట్టిస్తున్న ‘పుష్పగాడి రూలింగ్’.. వెనక్కి తగ్గిన బడా మువీ! తగ్గెదేలే..

అల్లు అర్జున్ పుష్ప 2 క్రేజ్ యావత్ సినీ ఇండస్ట్రీని శాసిస్తుంది. వచ్చేనెల మొదటి వారంలో వరల్డ్ వైడ్ విడుదలవనున్న ఈ మువీకి పోటీకి ఇతర సినిమాలు వచ్చేందుకు జంకుతున్నాయి. అంతేకాదు ఈ మువీ వచ్చిన దాదాపు 20 రోజుల వరకు కూడా థియేటర్లలోకి తమ సినిమాలు విడుదల చేసేందుకు జంకుతున్నారు..

Allu Arjun's Pushpa 2: చెమట్లు పట్టిస్తున్న 'పుష్పగాడి రూలింగ్'.. వెనక్కి తగ్గిన బడా మువీ! తగ్గెదేలే..
Allu Arjun's Pushpa 2
Srilakshmi C
|

Updated on: Nov 11, 2024 | 3:10 PM

Share

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మువీ ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్‌ ఊరమాస్‌ యాక్షన్‌, శ్రీవల్లిగా రష్మిక నటన సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ మువీలో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ మ్యానరిజం దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉర్రూతలూగించింది. ఇక ఇందులోని డైలాగ్‌లు, పాటలు.. ఒక్కటేమిటి ప్రతిదీ యువతను పిచ్చెక్కించింది. ముఖ్యంగా పుష్ప మువీలో సామ్‌ ‘ఊ అంటావా..’ పాట క్రేజ్‌ ఇప్పటికీ తగ్గలేదంటే అతిశయోక్తి కాదు. దక్షిణాది కంటే ఉత్తరాదిలో పుష్ప మానియా ఓ ఊపు ఊపేసింది. పుష్ప పార్ట్ 1లో.. కూలీ స్థాయి నుంచి ఎర్రచందనం సిండికేట్‌ను శాసించే స్థాయికి పుష్ప ఏవిధంగా ఎదిగాడనే సంఘటనలను చూపించారు.

ఇదే జోష్‌తో దూసుకుపోతున్న దర్శకుడు సుకుమార్ ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాగా ‘పుష్ప 2’ని కూడా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మువీ చిత్రీకరణ కూడా దాదాపు ముగింపుకొచ్చింది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్పెషల్‌ సాంగ్‌ శ్రీలీల చేస్తున్నట్లు టాక్‌. ఇప్పటికే విడుదలైన మువీ పోస్టర్ నుంచి టీజర్‌, ట్రైలర్‌ వరకు అన్నీ సోషల్ మీడియాను ఊపేశాయి. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇదిలాఉంటే.. భారీ బడ్జెట్‌పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పుష్ప 2కు పోటీగా సినిమాలు రిలీజ్ చేసేంకు సినీ ఇండస్ట్రీ గజగజలాడుతుందని సమాచారం. అందుకే తమ సినిమా రిలీజ్‌ డేట్‌లను ఒకటికి పది సార్లు ఆలోచించి మరీ పిక్స్‌ చేస్తున్నారట.

పుష్ప 2 మువీ ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్‌ చేస్తుందనీ తెలిసినా.. తాము కూడా డిసెంబర్ 6న రిలీజ్ చేస్తామని బాలీవుడ్‌ మువీ ‘చావా’ గతంలో ప్రకటించింది. అందుకు కారణం లేకపోలేదు.. చావా మువీ మరాఠీ యోధుడు ఛత్రపతి శివాజీపై తీసిన సినిమా. విక్కీ కౌశల్, రష్మిక మందన నటించిన ఈ మువీపై బీటౌన్‌లో కాస్త భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మువీ ట్రైలర్ కూడా సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంది. అయితే ‘చావా’ మేకర్స్ కూడా పుష్పతో పోటీకి తటపటాఇస్తున్నారని సమాచారం. రోజురోజుకు పెరుగుతున్న పుష్ప 2 క్రేజ్.. అందుకు ప్రధాన కారణం. దీంతో పుష్ప 2కు పోటీగా తమ సినిమా రిలీజ్ చేయకపోవడమే మంచిదని మేకర్స్ భావిస్తన్నారట. అందుకే చావా మువీ వాయిదా వేసి, రిలీజ్‌కు మరో రెండు కొత్త తేదీలను సెట్ చేసినట్లు టాక్‌. డిసెంబర్ 20 లేదా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.