పాకిస్తాన్ కు భారత సైనిక సమాచారాన్ని చేరవేస్తున్న’ఐఎస్ఐ ఏజెంట్’ అరెస్ట్.. కూరగాయలు అమ్ముతూనే..
భారత రక్షణ స్థావరాలకు, సైనికులకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ కు, ఐఎస్ఐకి రహస్యంగా చేరవేస్తున్న 'ఇంటిదొంగ' ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్తాన్ లోని పోఖ్రాన్ కి చెందిన ఇతడిని 34 ఏళ్ళ హాబీబుర్ రెహమాన్ గా గుర్తించారు. ఇండియన్ ఆర్మీకి చెందిన పలు ముఖ్యమైన ...
భారత రక్షణ స్థావరాలకు, సైనికులకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ కు, ఐఎస్ఐకి రహస్యంగా చేరవేస్తున్న ‘ఇంటిదొంగ’ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్తాన్ లోని పోఖ్రాన్ కి చెందిన ఇతడిని 34 ఏళ్ళ హాబీబుర్ రెహమాన్ గా గుర్తించారు. ఇండియన్ ఆర్మీకి చెందిన పలు ముఖ్యమైన మ్యాపులను, డాక్యుమెంట్లను పోలీసులు ఇతడినుంచి స్వాధీనం చేసుకున్నారు. రెహమాన్ పాక్ ఐఎస్ఐ తరఫున పని చేస్తున్నాడని, ఆ దేశానికి వెళ్లి వస్తుంటాడని ఖాకీలు తమ ఇన్వెస్టిగేషన్ లో కనుగొన్నారు. ఆగ్రాకు చెందిన పరమ్ జిత్ కౌర్ అనే సైనికుడు తనకు ఈ డాక్యుమెంట్స్ ఇస్తున్నాడని రెహమాన్ పోలీసులకు చెప్పాడు. వీటిని తాను కమల్ అనే వ్యక్తికి అందజేయాల్సి ఉందన్నాడు. పరమ్ జిత్ కౌర్ ని ప్రశ్నించిన అనంతరం సైనికాధికారులు అతడిని పోలీసులకు అప్పగించనున్నారు.
రెహమాన్ గత కొన్నేళ్లుగా పోఖ్రాన్ లో గల భారత ఆర్మీ బేస్ కి కాంట్రాక్టు పద్ధతిన కూరగాయలు సప్లయ్ చేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. అధికార రహస్యాల చట్టం కింద ఇతడిని మంగళ వారం అరెస్టు చేశారు. ఇది పెద్ద రాకెట్ అని తాము భావిస్తున్నామని, త్వరలో మరికొందరిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. రెహమాన్ తో బాటు పరమ్ జిత్ కౌర్ ని కూడా ఇంకా విచారిస్తామని వారన్నారు. పోఖ్రాన్ సైనిక శిబిరానికి కూరగాయలు అమ్ముతూ ఎవరికీ అనుమానం రాకుండా రెహమాన్ సాగించిన యవ్వారం పోలీసులను ఆశ్చర్యపరిచింది. ఇన్నేళ్ళుగా ఇతడు రహస్యంగా ఇన్ని డాక్యుమెంట్లు, మ్యాపులు ఎలా సేకరించాడన్నది మిస్టరీగా ఉందని, అయినా మరింత లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తామని వారు పేర్కొన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : రామయ్య నువ్వు రావాలయ్యా..!క్లిష్ట పరిస్థితుల్లో రామయ్యె రామబాణం అంటూ ఫ్యాన్స్ స్వాగతం.:Jr.NTR ReEntry Politics Live Video.
భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం..! జలమయంగా మారిన మహానగరం..:Heavy Rains Live Video.