My India My LiFE Goals: ‘వృక్షమాత’ సాలుమరద తిమ్మక్క.. మొక్కలనే బిడ్డలుగా భావించి ప్రేమను పంచింది.. 65 ఏళ్ల నుంచి..

Inspiring Story Saalumarada Thimmakka: తుముకూరు జిల్లాలోని గుబ్బి తాలూకాలో జన్మించిన తిమ్మక్క శ్రీ బిక్కల చిక్కయ్యను వివాహమాడారు. ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో అంతా హేళన చేసిన పట్టించుకోలేదు.. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు.. ఇద్దరు కలిసి.. మొక్కలు నాటడం మొదలుపెట్టారు. వాటికి ఆయువు పోసారు మొక్కలనే సొంత బిడ్డలుగా భావించి ప్రేమను పంచి..

My India My LiFE Goals: 'వృక్షమాత' సాలుమరద తిమ్మక్క.. మొక్కలనే బిడ్డలుగా భావించి ప్రేమను పంచింది.. 65 ఏళ్ల నుంచి..
Inspiring Story Saalumarada Thimmakka
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 07, 2023 | 7:13 PM

Inspiring Story Saalumarada Thimmakka: పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ.. ప్రకృతి నుంచి ఆశించడమే కాదు.. ప్రకృతికి ఎంతోకంత చేయాలి.. అలా చేస్తేనే పుడమితల్లి పులకరిస్తుంది.. భవిష్యత్తు తరాలు పచ్చగా ఉంటాయి.. ఆ ఆలోచనలతోనే ఆమె ప్రకృతి ప్రేమించింది.. పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించింది.. ఇలా.. వేలాది మొక్కలకు తల్లయింది.. 112 ఏళ్ల జీవితకాలంలో 65 ఏళ్లు ఆమె మొక్కలు నాటడానికే అంకితమయ్యారంటే.. ఆమె ప్రకృతి సేవ ఎలాంటిదో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.. ఆమె.. పర్యావరణ ప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సాలుమరద తిమ్మక్క .. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సాలుమరద తిమ్మక్క.. పర్యావరణ పరిరక్షణకు జీవితాంతం కృషిచేసింది. తుముకూరు జిల్లాలోని గుబ్బి తాలూకాలో జన్మించిన తిమ్మక్క శ్రీ బిక్కల చిక్కయ్యను వివాహమాడారు. ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో అంతా హేళన చేసిన పట్టించుకోలేదు.. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు.. ఇద్దరు కలిసి.. మొక్కలు నాటడం మొదలుపెట్టారు. వాటికి ఆయువు పోసారు మొక్కలనే సొంత బిడ్డలుగా భావించి ప్రేమను పంచి.. వేలాది వృక్షాలతో వనాన్నే ఏర్పాటు చేశారు. మర్రి చెట్ల పెంపకాన్ని మొదలుపెట్టిన తర్వాత నీళ్లు పోయ్యడం కోసం నాలుగు కిలోమీటర్ల వరకు ఎంతో కష్టపడి నీళ్లను మోసుకెళ్లేవారు.

సాధారణంగా మొక్కల పెంపకంపై దృష్టి పెట్టే వాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అయితే, ఈ వృద్ధురాలు మాత్రం ఏకంగా వేలాది మొక్కలను నాటి తన మంచి మనస్సును చాటుకున్నారు. పెళ్లై 20 ఏళ్లైనా పిల్లలు పుట్టకపోవడంతో మొక్కలను నాటి ఆ మొక్కలనే పిల్లల్లా పెంచుకుంటూ.. అందరికీ ఆదర్శంగా మారారు. 65 ఏళ్ల కాలంలో భర్త సహాయంతో వేలాది మర్రి చెట్లను, పలు రకాల వృక్షాలను నాటి.. ‘‘మదర్ ఆఫ్ ట్రీస్’’ గా ప్రసిద్ధి చెందారు. ఇప్పటి వరకు 8వేలకు పైగా మొక్కలు నాటి ‘మదర్ ఆఫ్ ట్రీ’గా పేరు తెచ్చుకోవడంతో భారత ప్రభుత్వం తిమ్మక్క సేవలను గుర్తించింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఆమె చేసిన నిస్వార్థ సేవకు గుర్తింపుగా, భారత ప్రభుత్వం 2019లో పద్మశ్రీ అవార్డుతో తిమ్మక్కను సత్కరించింది. కాగా.. పద్మశ్రీ అవార్డు గ్రహీత సాలుమరాద తిమ్మక్క నిన్న సాయంత్రం మంజునాథనగర్‌లోని తన నివాసంలో జారి పడ్డారు. దీంతో వెన్ను ఎముకకు గాయమైంది. జయనగర్ అపోలో ఆస్పత్రిలో ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా.. భారత ప్రభుత్వం ప్రత్యేక పర్యావరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ పరిరక్షణ కోసం ‘‘మై ఇండియా – మై లైఫ్‌ గోల్స్‌ పేరుతో.. లైఫ్‌ స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ మూవ్‌మెంట్‌’’ అనే నినాదంతో చేపట్టిన ఉద్యమంలో టీవీ9 నెట్‌వర్క్‌ భాగస్వామ్యంగా ఉంది. ఈ ఉద్యమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న ఆదర్శ వ్యక్తులను ప్రపంచానికి పరిచయం చేస్తోంది టీవీ9..

మరిన్ని జాతీయ వార్తల కోసం..

భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్