AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

My India My LiFE Goals: ఆశయం కోసం భూమి అమ్ముకున్నారు.. పచ్చదనానికి నిలువెత్తు రూపం మన రామయ్య..

My India My LiFE Goals: ఆశయం కోసం భూమి అమ్ముకున్నారు.. పచ్చదనానికి నిలువెత్తు రూపం మన రామయ్య..

Shaik Madar Saheb
|

Updated on: Aug 07, 2023 | 8:41 PM

Share

Green Warrior Daripalli Ramaiah: వృక్షో రక్షతి రక్షిత:.. నడక నేర్చిన రోజు నుంచి.. నా లక్ష్యం సుస్పష్టం.. నా కంటికి పచ్చదనం తప్ప.. ఇంకా ఏదీ కనిపించలేదు.. పర్యావరణ పరిరక్షణే ధ్యేయం అంటూ ఓ గొప్ప ఆలోచనకు కార్యరూపం ఇస్తున్నారు ట్రీమాన్‌ దరిపల్లి రామయ్య. ప్రకృతి కళకళలాడాలన్న ఆశయంతో ఇప్పటివరకు ఒక కోటికి పైగా మొక్కలు నాటారు. రామయ్య యువకుడిగా ఉన్న నాటినుంచి.. 86 ఏళ్ల వయస్సులో కూడా.. ఇప్పటికీ ఆ యజ్ఞం నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు వనజీవి దరిపల్లి రామయ్య..

Green Warrior Daripalli Ramaiah: వృక్షో రక్షతి రక్షిత:.. నడక నేర్చిన రోజు నుంచి.. నా లక్ష్యం సుస్పష్టం.. నా కంటికి పచ్చదనం తప్ప.. ఇంకా ఏదీ కనిపించలేదు.. పర్యావరణ పరిరక్షణే ధ్యేయం అంటూ ఓ గొప్ప ఆలోచనకు కార్యరూపం ఇస్తున్నారు ట్రీమాన్‌ దరిపల్లి రామయ్య. ప్రకృతి కళకళలాడాలన్న ఆశయంతో ఇప్పటివరకు ఒక కోటికి పైగా మొక్కలు నాటారు. రామయ్య యువకుడిగా ఉన్న నాటినుంచి.. 86 ఏళ్ల వయస్సులో కూడా.. ఇప్పటికీ ఆ యజ్ఞం నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు వనజీవి దరిపల్లి రామయ్య.. ఇంట్లో నుంచి బయటకు అడుగుపెడుతూనే విత్తనాలు.. మొక్కలు వెంట తీసుకెళతారు. అతని దినచర్య చూసి జనం ఓ మానసిక రోగిగా భావించారు. కానీ.. అతని లక్ష్యం మాత్రం ఆగలేదు.. ఒకటా రెండా.. అని లెక్కలు వేసుకోకుండా.. కోట్లాది మొక్కలను నాటారు.. నాటడమే కాదు.. నీళ్లు కూడా పోసి వచ్చేవారు.. అయితే.. చెట్ల రామయ్య కృషికి గుర్తింపుగా 2017లో పద్మశ్రీ అవార్డు వరించింది.. దీంతో పిచ్చివాడని పిలిచిన జనమే అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు. అతనితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే, ఒకసారి విత్తనాలు కొనలేని కడుపేదరికాన్ని అనుభవించారు రామయ్య. తన మూడెకరాల భూమిని సైతం అమ్మేసి తన ఆశయాన్ని కొనసాగించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా .. దరిపల్లి రామయ్యకు టీవీ9 నెట్‌వర్క్‌ శతకోటి వందనాలు తెలియజేస్తోంది..