Nirmala Seetharaman: పార్లమెంట్ వరకు వెళ్లిన టమాటా రేట్ల పంచాయితీ.. క్లారిటీ ఇచ్చేసిన నిర్మలా సీతారామన్
టమాటా ధరల పెరుగుదలపై చర్చ పార్లమెంటుకు కూడా వెళ్లింది. ప్రత్యేకంగా ఈ ధరల పెరుగుదలపై చర్చ జరిగింది. ప్రస్తుతం దేశంలో భారీగా పెరిగిన టమాటా ధరల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ కళానిధి విరస్వామి ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఆ ఎంపీ ప్రశ్నపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. అసలు టమాటా ధరలు ఎందుకు పెరిగాయో అనే విషయంపై వివరణ ఇచ్చారు.
దేశంలో గత కొన్నిరోజులుగా టమాటా ధరలు ఆకాశాన్ని తాకుతున్న సంగతి తెలిసిందే. చాలామంది ప్రజలు టమాటాలు కొనడానికే జంకుతున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే కిలో టమాటాలు వంద రూపాయలు ఉండగా.. మరోచోట 200, 300 రూపాయలు కూడా ఉంటున్నాయి. దీంతో కొంతమంది అసలు కూరల్లో టమాటాలు వేసుకోవడమే మానేశారు. అయితే ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టమాటా ధరల పెరుగుదలపై చర్చ పార్లమెంటుకు కూడా వెళ్లింది. ప్రత్యేకంగా ఈ ధరల పెరుగుదలపై చర్చ జరిగింది. ప్రస్తుతం దేశంలో భారీగా పెరిగిన టమాటా ధరల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ కళానిధి విరస్వామి ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఆ ఎంపీ ప్రశ్నపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. అసలు టమాటా ధరలు ఎందుకు పెరిగాయో అనే విషయంపై వివరణ ఇచ్చారు.
ఇటీవల ఉత్తర భారతదేశంలో భారీగా వర్షాలు కురిశాయని.. దీనివల్ల పెద్ద ఎత్తున టమాటా పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. అందువల్లే టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోయాయని తెలిపారు. అలగే పంట సీజన్‌లో మార్పు రావడం.. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో టమాటా పంటకు వైట్ ఫ్లై తెగులు రావడంతో దిగుబడి తగ్గిందని చెప్పారు. దీంతో టమాటా పంటకు డిమాండ్ పెరగడం, ఉత్పత్తి తగినంత లేకపోవడంతో కూడా వాటి ధరలు పెరిగాయని చెప్పారు. మరోవైపు కందిపప్పు పెరుగుదలపై కూడా మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. కందుల దిగుబడి తగ్గిపోయిందని చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం పప్పు దినుసులు, పప్పు బఫర్ స్టాక్ నుంచి స్టాక్‌ను విడుదల చేస్తూ ధరలను కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
మరోవైపు ట్రేడర్లకు స్టాక్ నిల్వ పరిమితిని విధిస్తున్నామని చెప్పారు. అలాగే ఎక్కడా కూడా అక్రమ నిల్వ చేయకుండా నిఘా పెడుతున్నామని పేర్కొన్నారు. అలాగే అవసరానికి తగ్గట్లుగా ఎగుమతి, దిగుమతి పాలసీలను మార్చడం వంటి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నిరుపేదలకు కూడా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఈ పథకం ద్వారా దేశంలోని 80 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారు. మరో విషయం ఏంటంటే ఇండియాలోని దాల్ పేరుతో సబ్సిడీ పై శనగ పప్పును ప్రభుత్వం మార్కె్ట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. ఇక కేంద్ర ప్రభుత్వం.. బియ్యం ధరలను కంట్రోల్ చేయడానికి బస్మతియేతర బియ్యం ఎగుమతిపై కూడా నిషేధం విధించింది. అలాగే గొధుమ దిగుమతులపై కూడా సుంకాన్ని తగ్గించాలని కేంద్రం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.