Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola Electric: కుక్క గారికి ఉద్యోగం ఇచ్చిన దిగ్గజ ఎలక్ట్రిక్‌ సంస్థ.. ఐడీ కార్డు చూశారా? భలేగుందిలే..

భారతీయ దిగ్గజ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా మూడు ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మోడళ్లు ఎస్1, ఎస్1 ప్రో, ఎస్ 1 ఎయిర్ అనే మూడు అధునాత ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. లాభాల బాటలో దూసుకుపోతోంది కూడా. తాజాగా ఎస్ 1 ఉత్పత్తిని నిలిపివేసిన ఓలా.. ప్రస్తుతం ఎస్1 ఎయిర్ ప్రొడక్షన్ ప్రారంభించింది. ఓలా కొత్తగా తయారు చేస్తోన్న ఎస్ 1 ఎయిర్ లైమ్..

Ola Electric: కుక్క గారికి ఉద్యోగం ఇచ్చిన దిగ్గజ ఎలక్ట్రిక్‌ సంస్థ.. ఐడీ కార్డు చూశారా? భలేగుందిలే..
Ola Electric Hires A Dog
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 07, 2023 | 6:53 PM

న్యూఢిల్లీ, ఆగస్టు 7: పట్టెడన్నం పెడితే చాలు శునకం ప్రాణం పోయేవరకు ఆకలి తీర్చిన వారిపై విశ్వాసం చూపిస్తుంది. అందుకే కాపలా కాయడంలో కుక్కలకు శిక్షణ ఇచ్చిమరీ ఎందరో ఇళ్లలో ఉంచుకుంటారు. అంతేకాకుండా నేరస్తుల్ని పట్టుకోవడంలో, క్లిష్టమైన కేసులని చేధించడంలోనూ శునకాల పాత్ర తక్కువేం కాదు. ఇలా కేసులను చేధించడానికి ఇన్నాళ్లు పోలీసులు మాత్రమే శునకాలకు శిక్షణ ఇచ్చి ఉపయోగించుకుంటారని ఇంతవరకూ మనందరికీ తెలుసు. తాజాగా ఓ దిగ్గజ కంపెనీ ఓ సునకానికి ఉద్యోగం, జీతం ఇచ్చి మరీ కూర్చీలో కూర్చోబెట్టింటి. అదేంటీ అనుకుంటున్నారా..? ఐతే మీరి విషయం తెలుసుకోవాల్సిందే..

భారతీయ దిగ్గజ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా మూడు ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మోడళ్లు ఎస్1, ఎస్1 ప్రో, ఎస్ 1 ఎయిర్ అనే మూడు అధునాత ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. లాభాల బాటలో దూసుకుపోతోంది కూడా. తాజాగా ఎస్ 1 ఉత్పత్తిని నిలిపివేసిన ఓలా.. ప్రస్తుతం ఎస్1 ఎయిర్ ప్రొడక్షన్ ప్రారంభించింది. ఓలా కొత్తగా తయారు చేస్తోన్న ఎస్ 1 ఎయిర్ లైమ్ గ్రీన్ స్కూటర్‌పై ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులంతా సిగ్నేచర్‌ చేశారు. కానీ కొత్తగా జాబ్‌లో చేరిన బిజిలి మాత్రం సంతకం చేయలేదు. చక్కగా స్కూటర్ సీటు పై కూర్చుని ఫొటోలకు ఫోజులిచ్చింది. బిజిలీ అంటే మహిళ లేదా పురుష ఉద్యోగి అనుకునేరు..! అదొక కుక్క. అవును.. మీరు చదువుతోంది కరెక్టే. సాక్షాత్తు ఓలా కంపెనీ సీఈవో భవిష్‌ అగర్వాల్‌ బిజిలీ అనే శునకానికి కొత్త ఉద్యోగం ఇచ్చి ఐడీ కార్డు మెడలో వేసి ఉద్యోగం కల్పించారు. ఇందుకు సంబంధించిన ఫోటోని ఆ సంస్థ సీఈవో తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం బిజిలీ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

బిజిలీ ఐడీలో 440v అనే ఎంప్లొయ్ కోడ్‌, బ్లడ్ గ్రూప్‌ పావ్‌ పాజిటివ్‌, కాంటాక్ట్‌ డీటెల్స్‌ కూడా మెన్షన్ చేసారు. న్యూ కొలీగ్‌ నౌ అఫీషియల్లీ అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోను షేర్‌ చేశారు. ఏదిఏమైనా డిగ్రీలు, పీహెచ్‌డీలు చేసి ఉద్యోగావకాశాలులేక ఎందరో నిరుద్యోగులు రోడ్లపై తిరుగుతుంటే.. అదే రోడ్డుపై తిరిగే కుక్కకు పెద్ద కంపెనీలో ఏసీ రూంలో జీతం ఇచ్చిమరీ ఉద్యోగం కల్పించడం ఆశ్చర్యమే కదా.. కాగా ఓలా ఎస్ 1 ఎయిర్ లైమ్ గ్రీన్ స్కూటర్ డెలివెరీలు త్వరలోనే ప్రారంభంకానుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.