ఖమ్మంలో వెరైటీ దొంగతనాలు: ‘ఇదెక్కడి ఖర్మరా బాబూ.. చేతికి ఏది దొరికినా పర్లేదా..!’ వీడియో వైరల్‌

ఇక్కడ వరుసగా జరుగుతున్న దొంగతనాలు చూస్తే కొంచెం విచిత్రంగా ,వెరైటీ గా ఉంటున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సింగరేణి ఉద్యోగి కొండల రావు ఇంట్లో గ్యాస్ సిలిండర్ తో ఉన్న స్టౌవ్ ను చోరీ చేశాడు.. ఓ దొంగ. ఈ దొంగతనం కోసం రెక్కీ నిర్వహించి.. ఇంటి ఎదురుగా ఉన్న చెట్టు కింద చాలా సేపు కాపు కాసి.. పట్టపగలు దర్జాగా.. చుట్టంలా ఇంట్లోకి వెళ్ళాడు. వాళ్ళు ఇంట్లో పనిలో నిమగ్నం అయి ఉండగా.. గ్యాస్ సిలిండర్‌ను ఏం చక్కా పట్టుకొని వచ్చాడు దొంగ..

ఖమ్మంలో వెరైటీ దొంగతనాలు: 'ఇదెక్కడి ఖర్మరా బాబూ.. చేతికి ఏది దొరికినా పర్లేదా..!' వీడియో వైరల్‌
Satthupalli Thief
Follow us
N Narayana Rao

| Edited By: Srilakshmi C

Updated on: Aug 08, 2023 | 11:47 AM

ఖమ్మం, ఆగస్టు 7: గత కొద్ది రోజులుగా అక్కడ అన్నీ వెరైటీ దొంగతనాలు జరుగుతున్నాయి. ఎవరైనా డబ్బు, నగలు, విలువైన వస్తువులు దొంగతనం చేస్తారు.. ఇక్కడ వరుసగా జరుగుతున్న దొంగతనాలు చూస్తే కొంచెం విచిత్రంగా ,వెరైటీ గా ఉంటున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సింగరేణి ఉద్యోగి కొండల రావు ఇంట్లో గ్యాస్ సిలిండర్ తో ఉన్న స్టౌవ్ ను చోరీ చేశాడు.. ఓ దొంగ. ఈ దొంగతనం కోసం రెక్కీ నిర్వహించి.. ఇంటి ఎదురుగా ఉన్న చెట్టు కింద చాలా సేపు కాపు కాసి.. పట్టపగలు దర్జాగా.. చుట్టంలా ఇంట్లోకి వెళ్ళాడు. వాళ్ళు ఇంట్లో పనిలో నిమగ్నం అయి ఉండగా.. గ్యాస్ సిలిండర్‌ను ఏం చక్కా పట్టుకొని వచ్చాడు దొంగ.

ఆ తర్వాత చెట్టు కింద కొద్దిసేపు నిల్చొని చేతిలో పట్టుకొని దర్జాగా వెళ్ళిపోయాడు. సత్తుపల్లి పట్టణంలో గత కొద్దిరోజులుగా ఏదో ఒక దొంగతనం జరుగుతోంది. విచిత్రంగా, వెరైటీగా ఉంటున్నాయి. అర్థరాత్రి వచ్చి.. ప్రూట్స్ బండి మీద ఉన్న ప్రూట్స్‌ను చోరీ చేసుకొని వెళ్ళాడు ఓ దొంగ. మొన్నటికి మొన్న మొక్కజొన్న కంకులు అమ్ముకునే మహిళకి చెందిన తోపుడు బండినీ చోరీ చేశాడు మరో దొంగ.

వెరైటీ దొంగతనాలు వీడియో:

ఇవి కూడా చదవండి

ఇప్పుడు పట్ట పగలే గ్యాస్ సిలిండర్‌ను దర్జాగా పట్టుకొని వెళ్ళాడు. ఈ వెరైటీ దొంగతనాలు అన్నీ.. సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇవి చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు, విలువైన వస్తువులు కాకుండా ఇవేం దొంగతనాలు.. అసలు ఈ దొంగల ఉద్దేశ్యం ఏంటో తేల్చాలని స్థానికులు చర్చించు కుంటున్నారు. ఆ దొంగ చేసిన పని సీసీ కెమెరాల లో రికార్డ్ అయ్యిందని కనిపెట్టలేక పోయాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.