AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: దారుణం.. మద్యం మత్తులో తాగుబోతు వీరంగం.. నడిరోడ్డుపై యువతిని వివస్త్రను చేసి..!

మన సికింద్రాబాద్ మహానగరంలోనే.. అమానవీయ ఘటన ఒకటి జరిగింది. నడిరోడ్డుపై ఓ మహిళను వివస్త్రను చేశాడో తాగుబోతు. అక్కడున్న వారెవరూ అతనిని కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఆ ఘటనను వీడియోలు, ఫోటోలు తీస్తూ ఉన్నారు తప్పితే.. మహిళ ఎవ్వరూ కూడా సాయం చేయలేదు. చివరకు ఆ కీచకుడి తల్లి కూడా అక్కడే ఉన్నా.. సాటి ఆడదాని బట్టలూడదీస్తుంటే చూస్తూ ఉండిపోయింది. అసలు ఇంతకీ ఏం జరిగింది.? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.?

Hyderabad: దారుణం.. మద్యం మత్తులో తాగుబోతు వీరంగం.. నడిరోడ్డుపై యువతిని వివస్త్రను చేసి..!
Hyderabad Police
Ravi Kiran
|

Updated on: Aug 07, 2023 | 6:58 PM

Share

మణిపూర్ అల్లర్లలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై యావత్ దేశం భగ్గుమంది. మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఆ కీచకులను కఠినంగా శిక్షించాలని లోకం గర్జిస్తోంది. అయితే ఇప్పుడు మన దగ్గరే.. మన సికింద్రాబాద్ మహానగరంలోనే.. అలాంటి అమానవీయ ఘటన ఒకటి జరిగింది. నడిరోడ్డుపై ఓ మహిళను వివస్త్రను చేశాడో తాగుబోతు. అక్కడున్న వారెవరూ అతనిని కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఆ ఘటనను వీడియోలు, ఫోటోలు తీస్తూ ఉన్నారు తప్పితే.. మహిళ ఎవ్వరూ కూడా సాయం చేయలేదు. చివరకు ఆ కీచకుడి తల్లి కూడా అక్కడే ఉన్నా.. సాటి ఆడదాని బట్టలూడదీస్తుంటే చూస్తూ ఉండిపోయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మ‌ద్యం మ‌త్తులో ఓ యువ‌కుడు దుశ్శాసనడులా ప్రవ‌ర్తించాడు..ఓ యువ‌తి ప‌ట్ల అస‌భ్యంగా ప్రవ‌ర్తించి, ఆమెను న‌డిరోడ్డుపై వివ‌స్త్రను చేశాడు. బాలాజీ నగర్‌కు చెందిన యువతి ఆదివారం రాత్రి షాపింగ్‌కి వెళ్లి తిరిగి వస్తోంది..అయితే అక్కడే కాపుకాసిన పెద్ద మారయ్య అనే కీచకుడు యువతిపై అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. అందరూ చూస్తుండగానే.. అమానుషంగా కొట్టి ఒంటిపై ఉన్న బట్టలను చింపేసి వివస్త్రను చేశాడు. కాపాడేందుకు వచ్చిన మరో మహిళను కూడా చితకబాదాడు ఆ తాగుబోతు.

బాధిత యువతి ఎంత వేడుకున్నా.. వినకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. ఒంటిపై బట్టలు చించేసి.. దాదాపు 15 నిమిషాలపాటు ఆమెను నగ్నంగా నడిరోడ్డుపై నిలబెట్టాడు.ఇక ఈ దారుణాన్ని చూస్తూ ఉండిపోయారే తప్ప.. స్థానికులు ఆమెకు సాయం చేయలేదు. అక్కడ నుంచి మారయ్య వెళ్ళాక.. కొందరు వచ్చి.. ఆమెకు పక్కనే ఉన్న ఫ్లెక్సీ కవర్లను చుట్టి.. అనంతరం పోలీసులకు సమాచారాన్ని అందించారు. కాగా, ఆ తర్వాత ఖాకీలు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నిందితుడు బాలాజీ నగర్‌కు చెందిన పెద్ద మారయ్యగా గుర్తించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని హైదరాబాద్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?