Gaddar: అధికార లాంఛనాలతో ముగిసిన గద్దర్ అంత్యక్రియలు.. పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం

తెలంగాణ గాయకుడు, ప్రజాయుద్దనౌక గద్దర్ (74) గద్దర్ అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం ఆయన తుదిశ్వాస విడిచిన అనంతరం ప్రజల సందర్శనార్థం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో పార్థీవ దేహాన్ని ఉంచారు. సోమవారం మధ్యాహ్నం అంతిమ యాత్రగా అల్వాల్‌లోని ఆయన ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మహోబోధి స్కూల్ గ్రౌండ్‌లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ముగిశాయి.

Gaddar: అధికార లాంఛనాలతో ముగిసిన గద్దర్ అంత్యక్రియలు.. పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం
Gaddar
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 07, 2023 | 8:11 PM

తెలంగాణ గాయకుడు, ప్రజాయుద్దనౌక గద్దర్ (74) గద్దర్ అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం ఆయన తుదిశ్వాస విడిచిన అనంతరం ప్రజల సందర్శనార్థం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో పార్థీవ దేహాన్ని ఉంచారు. సోమవారం మధ్యాహ్నం అంతిమ యాత్రగా అల్వాల్‌లోని ఆయన ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మహోబోధి స్కూల్ గ్రౌండ్‌లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ఈ అంతిమ యాత్రలో పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, ఉద్యమకారులు, గాయకలు, వివిధ పార్టీల నాయకులు తరలివచ్చారు. చివరిసారిగా గద్దర్‌ను చూసి చాలామంది తీవ్ర ఆవేదనకు గరయ్యారు. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా రాష్ట్రంలోని ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అల్వాల్‌లోని గద్దర్‌ నివాసానికి వచ్చి.. ఆయనకు నివాళులు అర్పించారు.

ఇదిలా ఉండగా మూడు రోజు క్రితం గద్దర్ అపోలో ఆసుపత్రిలోని గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. అయితే మళ్లీ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆదివారం మధ్యాహ్నం గద్దర్ కొడుకు సూర్యం ఈ విషయాన్ని వెల్లడించారు. గద్దర్ అసలు పేరు విఠల్ రావు. ఆయనకు భార్య ముగ్గరు పిల్లలు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిది. తన పాటలతోనే తెలంగాణ ఉద్యమ పోరాటానికి ఊపిరి పోశారు ఆయన. జై బోలో తెలంగాణ సినిమాలోని ‘పొడుస్తున్న పొద్దు మీద’ అనే సాంగ్ అప్పట్లో ఒక ఊపు ఊపింది. తెలంగాణ ఉద్యమానికి ఈ పాట హైలెట్‌గా నిలిచింది. అలాగే అమ్మా తెలంగాణమా, భద్రం కొడుకో, మదనసుందరి, అడవి తల్లికి వందనం లాంటి అనేక పాటలు పాడారు. . నీ పాదం మీద పుట్టుమచ్చనై పాటకు గద్దర్ నంది అవార్డుకు ఎంపిక అయ్యారు. అయినా కూడా దాన్ని ఆయన తిరస్కరించారు. ఆయన పాడిన అనేక పాటలు ఎంతోమందిలో స్పూర్తి నింపాయి. ఆ పాటలు వింటే ఎక్కడా లేని ఉత్సాహం, దూసుకెళ్లాలనే చైతన్యం కలుగుతుంది. అందుకే గద్దర్ పాటలన్నా.. సాధాసీదాగా గడిపే ఆయన జీవన శైలి అన్నా ఎంతోమందికి మక్కువ.

ఇవి కూడా చదవండి

1949లో జూన్ 5వ తేదిన గద్దర్ జన్మించారు. మెదక్ జిల్లాలోని హన్మాజిపేట ఆయన స్వగ్రామం. అయితే ఆయన విద్యాభ్యాసం నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగింది. అలాగే గద్దర్ హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్ చేశారు. ఆ తర్వాత కెనరా బ్యాంకులో ఉద్యోగం వచ్చినప్పటికీ దానికి రాజీనామ చేశారు. 1969 నుంచే గద్దర్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. జననాట్యమండలి వ్యవస్థాపకుల్లో ఒకరైన గద్దర్.. బండెనక బండి కట్టి అనే పాట పాడారు. అప్పట్లో ఈ పాటకు ఆయన అనేక పురస్కారాలు అందుకున్నారు. ఇదిలా ఉండగా గద్దర్ మృతి పట్ల.. రాజకీయ, సినీ ప్రముఖులు, గేయ రచయితలు సంతాపం తెలుపుతూ ఆయనతో తమకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు.

Latest Articles