Medak District: మొన్న వర్షాలు, ఇప్పుడు తెగుళ్లు.. మొయిపురుగుతో ఇబ్బందులు పడుతున్న రైతన్నలు..

Medak District: అతివృష్టిగా మారిన వర్షాలు చాలా చోట్ల రైతన్నలను కలవర పెట్టాయి. అలాగే ఈ వర్షాల ధాటికి పలు చోట్లు పంట పొలాలు అన్నీ నీట మునిగి పోయాయి. అందులో నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రైతులకు, మొగి పరుగుల రూపంలో మళ్ళీ కొత్త సమస్య వచ్చి పడింది. ముందుగా వేసిన వరి చేళ్ళకు మొగి పురుగు తగిలి, వరి కాండం పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని చాలా చోట్ల ఈ పరిస్థితి నెలకొంది. వేసిన వరికి తెగులు తగలడంతో

Medak District: మొన్న వర్షాలు, ఇప్పుడు తెగుళ్లు.. మొయిపురుగుతో ఇబ్బందులు పడుతున్న రైతన్నలు..
Paddy Cultivation
Follow us
P Shivteja

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Aug 07, 2023 | 12:44 PM

మెదక్ జిల్లా, ఆగస్టు 7: రైతులకు మొన్నటి వరకు ఒక బాధ.. అది పోయిందనుకునే లోపే ఇప్పుడుఇంకో బాధ మొదలైంది. మొన్నటి వరకు విస్తారంగా కురిసిన వర్షాలు పడ్డాయి. ఇక పంటలకు డోక లేదని అనుకుంటున్న సమయంలోనే అవి కాస్త అతివృష్టిగా మారి చాలా చోట్ల రైతన్నలను కలవర పెట్టింది. అలాగే ఈ వర్షాల ధాటికి పలు చోట్లు పంట పొలాలు అన్నీ నీట మునిగి పోయాయి. అందులో నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రైతులకు, మొగి పరుగుల రూపంలో మళ్ళీ కొత్త సమస్య వచ్చి పడింది. ముందుగా వేసిన వరి చేళ్ళకు మొగి పురుగు తగిలి, వరి కాండం పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని చాలా చోట్ల ఈ పరిస్థితి నెలకొంది. వేసిన వరికి తెగులు తగలడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మెదక్ జిల్లా రైతులు.

జిల్లాలోని దుబ్బాక మండలంలో రాజక్క పేట, చెల్లాపూర్‌తో పాటు చుట్టుపక్కల పలు గ్రామాల్లో రైతులు ఈ సారి వరిసాగు పెద్ద మొత్తంలో వేశారు.. అయితే మొన్నటి వరకు భారీగా కురిసిన వర్షానికి కొందరు రైతులు ముందుగానే వరి నాట్లు వేయగా ఇప్పుడు ఆ వరి పైరుకు మొగి పురుగు సోకి పూర్తిగా కాండాన్ని పాడు చేస్తున్నాయి. ఇది ఇలాగే ఉంటే వరి పంట మొత్తం దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు.

రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

మొగి పరుగుల బారిన పడకుండా రైతన్నలు ఏం చేయాలంటే.. ముందుగా నారుమల్లు దున్ని, నారు మడుల్లో నారు పోసేటప్పుడు కార్బోఫిల్ గుళికలు కానీ కాటో బెట్ గుళికలు కానీ ఒక కిలో నారుమళ్ళలో చల్లుకోవాలి. దీనివల్ల ఒక నెల వరకు మొగిపురుగును నివారించుకోవచ్చు. నాటు వేసిన మడుల్లో ఐరవై నుండి నెల రోజుల తర్వాత ఎకరానికి 8 కిలోల కార్బోఫిల్ గుళికలు కానీ, కాటోబెట్ గుళికలు కానీ లేదంటే ఫెలో గుళికలు వేయాలని, వీటి వల్ల మొగి పురుగును నివారించవచ్చని చెబుతున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. పురుగు ఉధృతి పెరిగితే క్లోరైడ్ పౌడర్ 400 గ్రాములు తీసుకొని.. 200 గ్రాముల నీటిలో వేసి పిచికారీ చేయాలి.. ఇలా చేస్తే పురుగు ఉధృతి పూర్తిగా తగ్గిపోతుందని వారు సూచిస్తున్నారు. అయితే మొన్నటి వరకు కురిసిన వర్షాలతో, ఇప్పుడు ఈ మొగిపరుగుల బాధతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. వరి సాగు ప్రారంభ దశలోనే ఇలాంటి తెగుళ్లు ఎదురైతే పంట పండించలేమని వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..