Telangana: సరసాలు, కవ్వింపులు, రాసలీలలతో రచ్చకెక్కుతున్న ప్రభుత్వ పాఠశాల
ఈ టీచర్ల వ్యవహారం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. సభ్యసమాజం చీదరించుకుంటున్న వారు ప్రవర్తనను మార్చుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వారిని అసలు సూళ్లలోకి అనుమతించకూడదని.. పలువురు పౌర సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. పెడతోవ పట్టిన ఈ టీచర్ల వల్ల.. విద్యార్థుల మనసుల్లో కూడా తప్పుడు ఆలోచనలు నాటుకుపోయే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
నల్గొండ, ఆగస్టు 7: గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్ష్యాత్ పర బ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః… అంటే గురువే బ్రహ్మ , గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు, తల్లితండ్రుల కంటే గురువే సకలమని అర్థం. అయితే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి.. జ్ఞానాన్ని పంచి భవిష్యత్తును అందంగా తీర్చి దిద్దాల్సిన గురువులు తప్పుదోవ పడుతున్నారు. విద్యార్థుల జీవితాలకు మార్గనిర్దేశం చేయాల్సిన ఉపాధ్యాయులు రాసలీలల్లో మునిగి తేలుతూ విద్యా వవస్థను అబాసుపాలు చేస్తున్నారు. ఉపాధ్యాయుల రాసలీలలు చూడలేక తల్లితండ్రులకు చెబితే కేసులు పెడతాం అని వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో ఈ ఉపాధ్యాయులు మాకొద్దంటూ గ్రామస్థులు నిరసన తెలిపేవరకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా మోతె మండలం ఉర్లుగొండ ప్రభుత్వోన్నత పాఠశాలలో ప్రాధానోపాధ్యాయుడు అక్కడే పని చేసే ఉపాధ్యాయినితో రాసలీలల్లో మునిగిపోవడం కలకలం రేపుతోంది. సదరు టీచర్ల వెకిలి చేష్టలతో విసిగిపోయిన విద్యార్థులు, గ్రామస్థులు ఆందోళన బాటపట్టారు. ఈ ఉపాధ్యాయులు మాకొద్దంటూ అల్టిమేటం ఇచ్చారు.
గత నవంబర్‌లో ఇలాంటి చేష్టలు చేస్తున్న ఈ టీచర్స్ ఇద్దరినీ పేరెంట్స్ కమిటీ సమావేశంలో నిలదీసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.. దీంతో నామమాత్రంగా మహిళా ఉపాధ్యాయినిని మరో చోటకు డెప్యుటేషన్‌పై పంపారు. కొద్ది రోజుల క్రితం తిరిగి ఆమె అదే పాఠశాలకు వచ్చారు. మళ్ళీ అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. దీంతో గ్రామస్థులందరు వీరి ప్రవర్తన పై విసుగుచెంది ఆర్జేడీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా, విచారణకు ఆదేశించారు. విచారణ బృందం వస్తారన్న సమాచారంతో సదరు ఉపాధ్యాయుల జంట… విద్యార్థులను వేధించడం మొదలు పెట్టారు. విద్యార్థులతో పాఠాశాల మొత్తం ఊడిపించడం, నిజం చెబితే మీపై మీ తల్లితండ్రులపై కేసులు పెడతామని హెచ్చరించారు. అధికారుల విచారణలో హెడ్మాస్టర్, టీచర్ రాసలీలల వివరాలను వారికి చెప్పారు. ఈ ఉపాధ్యాయులు మాకొద్దని తీర్మానం చేసి, వారు తిరిగి వస్తే పాఠశాలకు తాళం వేస్తామని హెచ్చరించారు.
ఈ టీచర్ల వ్యవహారం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. సభ్యసమాజం చీదరించుకుంటున్న వారు ప్రవర్తనను మార్చుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వారిని అసలు సూళ్లలోకి అనుమతించకూడదని.. పలువురు పౌర సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. పెడతోవ పట్టిన ఈ టీచర్ల వల్ల.. విద్యార్థుల మనసుల్లో కూడా తప్పుడు ఆలోచనలు నాటుకుపోయే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. మరీ వీరిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం