Gaddar: గద్దర్ అంత్యక్రియలను అధికారికలాంచనాలతో చేయాలనుకోవడం పోలీసు అమరవీరులను అగౌరవ పరచడమే అంటున్న ATF

ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేఖంగా సాయిధ పోరాటాలు చేయడానికి తన సాహిత్యం ద్వారా యువతను దేశ ద్రోహులుగా తయారు చేసిన గద్దర్ లాంటి ఒక వ్యక్తికి నేడు తెలంగాణా ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడం తీవ్రంగా ఖండించదగిన చర్య, ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్య పరిరక్షణలో..  శాంతి భధ్రతల పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను..  ప్రజల త్యాగాలను అవమానించడమే అవుతుందని అంటుంది ATF.

Gaddar: గద్దర్ అంత్యక్రియలను అధికారికలాంచనాలతో చేయాలనుకోవడం పోలీసు అమరవీరులను అగౌరవ పరచడమే అంటున్న ATF
Follow us
Vijay Saatha

| Edited By: Surya Kala

Updated on: Aug 07, 2023 | 9:43 AM

గద్దర్‌కు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడం నక్సలైట్ (మావోయిజం) వ్యతిరేఖ పోరాటంలో అమరులైన పోలీసుల మరియు పౌరుల త్యాగాలను అవమానించడమే. గద్దర్ తన విప్లవ పాటల ద్వారా వేలాది మంది యువకులను నక్సలైట్ ఉద్యమం వైపు మళ్ళించిన వ్యక్తి. ప్రజాస్వామ్యానికి వ్యతిరేఖంగా తుపాకీ పట్టిన నక్సల్స్ ఉద్యమం వేలాది మంది పోలీసులను బలితీసుకుంది, నక్సలిజం (మావోయిజం) సాధారణ పౌరులపై ..  జాతీయ వాదులపై కూడా దాడులు జరిపి అనేక మందిని బలితీసుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేఖంగా సాయిధ పోరాటాలు చేయడానికి తన సాహిత్యం ద్వారా యువతను దేశ ద్రోహులుగా తయారు చేసిన గద్దర్ లాంటి ఒక వ్యక్తికి నేడు తెలంగాణా ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడం తీవ్రంగా ఖండించదగిన చర్య, ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్య పరిరక్షణలో..  శాంతి భధ్రతల పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను..  ప్రజల త్యాగాలను అవమానించడమే అవుతుంది.

ప్రభుత్వ నిర్ణయం పోలీసు బలగాల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజాస్వామ్య వాదులు ప్రతి ఒక్కరు ఖండించాలి. పోలీసు అమరవీరుల కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయంతో తీవ్రంగా కలత చెందుతున్నాయి. పోలీసు అధికారుల సంఘం కూడా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంపై నోరు విప్పి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోనేలా చూడాలని కోరుతున్నామని యాంటి టెర్రరిజం ఫోరం  డిమాండ్ చేస్తుందన్నారు కన్వీనర్  డా.  రావినూతల శశిధర్.

దీనిని ఒక వ్యక్తికి జరుగుతున్న అంత్యక్రియలుగా మాత్రమే చూడకూడదని అధికారికంగా అంత్యకియలు జరిపితే ప్రభుత్వం నక్సలైట్ ( మావోయిజం ) భావజాలానికి పోలీసు బలగాలతో అధికారికంగా సెల్యూట్ చేయించడమే అవుతుందన్నారు. వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ATF  డిమాండ్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..