AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gaddar: జోహార్ గద్దర్.. ప్రజా యుద్ధనౌకకు సీఎం కేసీఆర్ నివాళులు.. పార్టీలకు అతీతంగా అంతిమయాత్రలో పాల్గొన్న నేతలు.. లైవ్

ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్ అంతిమయాత్ర కొనసాగుతోంది. హైదరాబాద్ ఎల్‌.బి.స్టేడియం నుంచి ప్రారంభమైన గద్దర్‌ అంతిమయాత్ర.. గన్‌పార్క్‌, నెక్లెస్‌రోడ్డులోని బాబూ జగ్జీవన్‌ రామ్‌, అంబేద్కర్‌ విగ్రహం ముందు నుంచి.. అల్వాల్‌ చేరుకోనుంది. అల్వాల్‌ వెంకటాపూర్‌ భూదేవీనగర్‌లోని ఆయన స్వగహానికి భౌతికకాయాన్ని తరలిస్తారు. స్థానికుల సందర్శనార్థం కాసేపు ఉంచి.. మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Gaddar: జోహార్ గద్దర్.. ప్రజా యుద్ధనౌకకు సీఎం కేసీఆర్ నివాళులు.. పార్టీలకు అతీతంగా అంతిమయాత్రలో పాల్గొన్న నేతలు.. లైవ్
Gaddar
Narender Vaitla
| Edited By: |

Updated on: Aug 07, 2023 | 5:56 PM

Share

ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్ అంతిమయాత్ర కొనసాగుతోంది. హైదరాబాద్ ఎల్‌.బి.స్టేడియం నుంచి ప్రారంభమైన గద్దర్‌ అంతిమయాత్ర.. గన్‌పార్క్‌, నెక్లెస్‌రోడ్డులోని బాబూ జగ్జీవన్‌ రామ్‌, అంబేద్కర్‌ విగ్రహం ముందు నుంచి.. అల్వాల్‌ చేరుకోనుంది. అల్వాల్‌ వెంకటాపూర్‌ భూదేవీనగర్‌లోని ఆయన స్వగహానికి భౌతికకాయాన్ని తరలిస్తారు. స్థానికుల సందర్శనార్థం కాసేపు ఉంచి.. మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. అక్కడ గద్దర్ అంత్యక్రియల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం గద్దర్ అంతిమయాత్ర ట్యాంక్‌బండ్‌ పైకి చేరుకుంది. కడసారి ప్రజాగాయకుడికి నివాళి అర్పించేందుకు కళాకారులు పోటెత్తారు. కళాకారుల ప్రదర్శనలు చేస్తూ ఉద్యమ గాయకుడికి నివాళులర్పిస్తున్నారు. డప్పు నృత్యాలు, కళ్లకు గజ్జె కట్టి కళాకారులు ఆడుతూ.. పాడుతూ గద్దర్ కు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. కాగా.. అల్వాల్‌లో మహాబోధి స్కూల్ గ్రౌండ్‌లో గద్దర్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. గద్దర్ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ముందుగా ఆయన ఇంటి దగ్గర గద్దర్ భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటిస్తారు.

ఆట.. పాటతో ప్రజా బాహుళ్యాన్ని ఉర్రూతలూగించిన ప్రజా గాయకుడు గద్దర్‌ భౌతికకాయానికి ఎల్బీ స్టేడియంలో ప్రజాసంఘాల నేతలు, రాజకీయ నేతలు నివాళులర్పించారు. జోహార్ గద్దర్‌, అమర్‌ రహే గద్దరన్న అంటూ అభిమానుల నినాదాలతో ఎల్బీ స్టేడియం హోరెత్తింది. మరోవైపు గద్దర్ మరణంతో మాకు దిక్కెవరంటూ ఆల్వాల్‌లోని భూదేవినగర్‌వాసులు కన్నీటిపర్యంతమవుతున్నారు. గద్దర్ కు నివాళులర్పించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు ప్రజాసంఘాల నేతలు తరలివస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని, ఙ్ఞాపకాలను తల్చుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు.

లైవ్ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న గద్దర్‌ జులై 20న గుండె పోటుతో అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చేరారు. గుండె రక్తనాళాలు మూసుకుపోయినట్టు నిర్ధారించిన డాక్టర్లు.. ఈ నెల 3న సర్జరీ చేశారు. అంతకుముందు నుంచే మూత్ర పిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతుండటంతో గద్దర్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. నిన్న ఉదయం అకస్మాత్తుగా రక్తపోటు పెరిగింది. షుగర్‌ లెవల్స్‌ పడిపోయాయి. మధ్యాహ్నానికల్లా శరీరంలోని పలు అవయవాలు పనిచేయడం ఆగిపోయాయి. ఆయనను కాపాడేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. గద్దర్ మరణాన్ని ప్రజా సంఘాల నేతలు, రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..