Viral Video: బీచ్‌లో ఆ మహిళ చేసిన పనికి తిట్టిపోస్తున్న జనం.. వీడియో చూస్తే మీరూ అదే అంటారు.!
ఫ్రెండ్‌తో కలిసి బీచ్‌కు వెళ్లింది ఓ మహిళ. తన స్నేహితురాలితో కలిసి బీచ్ అంతా తిరిగింది. ఎంజాయ్ చేసింది. అయితే ఆ మహిళకు ఏమనిపించిందో ఏమో బీచ్‌లో ఉన్న చెత్త మొత్తాన్ని ఏరేసింది. ఓ రెండు నల్ల బ్యాగుల్లోకి నింపింది. ఒకటి భుజాన వేసుకుంది. మరొకటి చేత్తో పట్టుకొని ఈడ్చుకొస్తుంది. ఇక ఈ తతంగం అంతటిని.. తన స్నేహితురాలు వీడియో తీసింది. ఆ చెత్త ఏరిన మహిళ చెత్త కవర్లతో ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది.. సీన్ కట్ చేస్తే..
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన దగ్గర నుంచి.. ఓవర్‌నైట్‌లో స్టార్స్ అయిపోవాలనే ఆశతో చాలామంది చిత్రవిచిత్రమైన ట్రిక్కులు, స్టంట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే.. ఇంకొంచెం అడుగు ముందుకేసి.. చేయని పనులను కూడా.. చేస్తున్నట్టుగా.. ఏదో సమాజ సేవలో భాగస్వాములు అయినట్టుగా ఫోటోలు, వీడియోలు తీసుకుని ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తున్నారు. అవి కాస్తా వైరల్ కావడం.. వీరికి తిరుగులేని ఫ్యాన్స్ దక్కడం.. క్షణాల్లో జరుగుతోంది. సరిగ్గా ఇదే కోవలో ఓ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి.. బీచ్‌లో తన ఫ్రెండ్‌తో కలిసి ఏదో మంచి పనికి పూనుకుంది. కానీ సీన్ కట్ చేస్తే.. ఆ తర్వాత జరిగిన పరిణామాన్ని చూసి.. నెటిజన్లు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..
ఫ్రెండ్‌తో కలిసి బీచ్‌కు వెళ్లింది ఓ మహిళ. తన స్నేహితురాలితో కలిసి బీచ్ అంతా తిరిగింది. ఎంజాయ్ చేసింది. అయితే ఆ మహిళకు ఏమనిపించిందో ఏమో బీచ్‌లో ఉన్న చెత్త మొత్తాన్ని ఏరేసింది. ఓ రెండు నల్ల బ్యాగుల్లోకి నింపింది. ఒకటి భుజాన వేసుకుంది. మరొకటి చేత్తో పట్టుకొని ఈడ్చుకొస్తుంది. ఇక ఈ తతంగం అంతటిని.. తన స్నేహితురాలు వీడియో తీసింది. ఆ చెత్త ఏరిన మహిళ చెత్త కవర్లతో ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చింది. ఇంత వరకూ బాగానే ఉంది. అయితే ఆ తర్వాత మాత్రం ఆమె చేసిన పనికి నెటిజన్లు ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తిట్టిపోస్తున్నారు.
ఇంతకీ ఆమె ఏం చేసిందంటే, చెత్తతో వీడియోలు, ఫొటోలు తీయించుకోవడం అయిపోయిన తర్వాత ఆమె ఆ రెండు బ్యాగులను అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. ఇప్పటికే అక్కడ ఆమె ఏం చేసిందో మీకో క్లారిటీ వచ్చేసి ఉంటుంది. అవునండీ.! మీరనుకున్నది కరెక్టే.. ఆమె చేసిందంతా కేవలం పబ్లిసిటీ కోసమే.. ఏదో మంచి పని చేస్తున్నట్టు ఆ బీచ్‌లో ఉన్న చెత్తనంతా తీసేస్తున్నట్టుగా ఫోటోలు, వీడియోలకు పోజులిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో కాస్తా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇక వీడియో చూసినవాళ్లు ఊరికే ఉంటారామరి.. ఆ మహిళ తీరుకు దుమ్మెత్తిపోస్తున్నారు. చెత్త ప్రవర్తన అంటూ ఈ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ కాగా, ఇప్పటికే మిలియన్ మందికి పైగా వీక్షించారు. పదివేలమందికి పైగా లైక్ చేశారు. అయితే ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో క్లారిటీ లేదు, కానీ మహిళ తీరు పట్ల మాత్రం నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
To look like you care about the environment pic.twitter.com/w9eMWH5D2D
— CCTV IDIOTS (@cctvidiots) August 3, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..