AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inspiring Story: సాధారణ కుటుంబానికి చెందిన ఈ తండ్రికూతుళ్లు ఎందరికో ఆదర్శం.. కేంద్ర మంత్రి ట్వీట్‌..!

Inspiring: ఓ సాధారణ కుటుంబానికి చెందిన యువతి ఐఐటీ కార్పూర్‌లో పీజీ అడ్మిషన్‌ సాధించడం ప్రశంసలు అందుకుంటోంది ఆర్య అనే యువతి. పెట్రోల్‌ బంక్‌లో..

Inspiring Story: సాధారణ కుటుంబానికి చెందిన ఈ తండ్రికూతుళ్లు ఎందరికో ఆదర్శం.. కేంద్ర మంత్రి ట్వీట్‌..!
Subhash Goud
| Edited By: Janardhan Veluru|

Updated on: Oct 09, 2021 | 12:02 PM

Share

Inspiring: ఓ సాధారణ కుటుంబానికి చెందిన యువతి ఐఐటీ కార్పూర్‌లో పీజీ అడ్మిషన్‌ సాధించడం ప్రశంసలు అందుకుంటోంది ఆర్య అనే యువతి. పెట్రోల్‌ బంక్‌లో పని చేసే ఓ ఉద్యోగి కుమార్తె అయిన ఆర్య. ఇప్పుడు ఐఐటీ కాన్పూర్‌లో పీజీ అడ్మిషన్‌ సాధించారు. కేరళలోని పయ్యనూర్‌కు చెందిన ఆర్య తండ్రి రాజగోపాల్‌ గత 20 సంవత్సరాలుగా పెట్రోల్‌ బంక్‌లో పని చేస్తున్నాడు. భార్య ఓ ప్రైవేట్‌ కంపెనీలో రిసెప్షనిస్ట్‌ పని చేస్తోంది. వారు కూతురు భవిష్యత్తు గురించి చాలా గొప్పగా ఊహించుకునేవాడు రాజగోపాల్‌. కుమార్తె భవిష్యత్తులో ఎదిగేందుకు ఎంతగానో కష్టపడ్డారు. తాము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే.. ఆర్య చదువుకు మాత్రం అడ్డంకులు ఎదురు కానీవ్వలేదు తండ్రి.

ఇంకో ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే.. ఆర్య తండ్రి పెట్రోల్‌ బంక్‌లో సాధారణ ఉద్యోగి కదా.. ఇప్పుడు ఆర్య పీజీ అడ్మిషన్‌ పొందిన కోర్సు పెట్రోలియమ్‌ ఇంజనీరింగ్‌ కావడం విశేషం. ఆర్య కథ కేవలం ఆమె చదవులో చూపిన ప్రతిభ గురించి మాత్రమే కాదు.. ఆమె పట్టుదల, సంకల్పం గురించి కూడా. ఇప్పుడు వీరు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇక తల్లిదండ్రుల కష్టాన్ని, వారు కనే కలలను అర్థం చేసుకున్ ఆర్య చదువులోనూ ముందుండేది. మంచి మార్కులు తెచ్చుకుని మంచి పేరు విద్యాసాంస్థల్లో సీటు సంపాదించాలని భావించింది. దీంతో కుమార్తె ఆర్య నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) నుంచి తన బ్యాచిలర్‌ పూర్తి చేసింది. ఇప్పుడు పీజీ చేయడం కోసం ఐఐటీ కాన్పూర్‌లో సీటు సాధించి తండ్రి కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చినట్లయింది. ఇప్పుడు ఆర్య సాధించిన విజయం తదితర అంశాల గురించి అశ్విన్‌ నందకుమార్‌ అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆర్య కథ చదివిన వారు తండ్రికూతుళ్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆర్య విజయం కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరికి తెలిసింది. దీంతో ఆయన ఆర్యను ప్రశంసిస్తూ.. ట్వీట్‌ చేశారు. తండ్రీ, కూతురు భారతదేశానికి స్ఫూర్తిగా నిలుస్తున్నట్లు మంత్రి హర్థీప్‌ పూరి ట్వీట్‌ చేశారు. ఇంధన రంగంతో సంబంధం ఉన్న వారందరూ ఎంతో గర్వపడాలని అన్నారు. ఆర్య విజయం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆర్య, తండ్రి రాజగోపాల్‌ల విజయం పట్ల దేశ ఇంధన రంగంతో సంబంధం ఉన్న మనమందరం నిజంగా ఎంతో గర్వపడుతున్నాము. ఈ ఆదర్శవంతమైన తండ్రి-కుమార్తెల ద్వయం ఎందరికో స్ఫూర్తి అని అన్నారు. కొత్త భారతదేశానికి స్ఫూర్తి, మార్గదర్శకులు. వారిరువురికి నా శుభాకాంక్షలు.. అంటూ మంత్రి ట్వీట్‌ చేశారు.

ఇవీ కూడా చదవండి:

Apple iPhone 11 128GB: పండగ సీజన్‌లో ఐఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌లో రూ.30 వేలకే ఐఫోన్‌ 11.. పూర్తి వివరాలు..!

Fuel Credit Card: మీరు క్రెడిట్‌ కార్డుతో పెట్రోల్‌, డీజిల్‌ కొంటున్నారా..? జాగ్రత్త.. ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి..!