AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakhimpur Case: లఖింపూర్ రైతుల హత్య కేసులో పోలీసుల ముందుకు కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా..అరెస్ట్ చేసే అవకాశం!

లఖింపూర్ హింసాకాండలో ప్రధాన నిందితుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ ఈరోజు క్రైమ్ బ్రాంచ్ ముందు హాజరుకానున్నారు. లఖింపూర్ పోలీసులు ఆశిష్‌ను శనివారం(09.10.2021) ప్రశ్నించడానికి పిలిచారు.

Lakhimpur Case: లఖింపూర్ రైతుల హత్య కేసులో పోలీసుల ముందుకు కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా..అరెస్ట్ చేసే అవకాశం!
Lakhimpur Case
KVD Varma
|

Updated on: Oct 09, 2021 | 9:44 AM

Share

Lakhimpur Case: లఖింపూర్ హింసాకాండలో ప్రధాన నిందితుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ ఈరోజు క్రైమ్ బ్రాంచ్ ముందు హాజరుకానున్నారు. లఖింపూర్ పోలీసులు ఆశిష్‌ను శనివారం(09.10.2021) ప్రశ్నించడానికి పిలిచారు. ఈమేరకు పోలీసులు ఒక నోటీసును శుక్రవారం (08.10.2021) ఆయన ఇంటిముందు అంటించారు. అంతకుముందు, గురువారం కూడా పోలీసులు శుక్రవారం రాత్రి 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసు ఇచ్చారు. కానీ, ఆశిష్ చేరుకోలేదు. తరువాత, ఆశిష్ అనారోగ్యంతో ఉన్నాడని ఒక లేఖ రాశాడు. కాబట్టి అతను అక్టోబర్ 9 న పోలీసుల ఎదుట హాజరవుతాడు.

ఆశిష్ మిశ్రాను అరెస్టు చేయవచ్చు

ఆశిష్ మిశ్రాను ప్రశ్నించిన తర్వాత, అతని అరెస్టు ఖాయమని చెబుతున్నారు. రైతులపై దూసుకుపోయిన థార్ జీప్ నుంచి బయటకు వచ్చిన ఆశిష్ ఫార్చ్యూనర్‌లో కూర్చున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ సాక్ష్యం తెరపైకి వస్తే ఆశిష్ కష్టాలు పెరుగుతాయని నమ్ముతున్నారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా గురువారం ఒక పెద్ద నాయకుడి ఆదేశం మేరకు ఢిల్లీలో ఉన్నారు. ఆశిష్‌ను పోలీసుల ముందు హాజరుపరచమని ఆ పెద్ద నాయకుడు అజయ్ మిశ్రాకు సందేశం పంపినట్లు వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత మంత్రి లక్నో వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆయన ఆశిష్ శనివారం పోలీసుల ఎదుట హాజరవుతారని, విచారణలో సహకరిస్తాడని చెప్పారు. సుప్రీంకోర్టు ఈ విషయంలో తీవ్రంగా స్పందించిన తరువాత కేంద్ర మంత్రి ఈ ప్రకటన తెరపైకి వచ్చింది. ఎందుకంటే, ఈ విషయంలో సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది.

లఖింపూర్ కేసులో రాజకీయాలు కొనసాగుతున్నాయి. ప్రియాంక, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ తరువాత, ఇప్పుడు పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధూ లఖింపూర్‌లో విడిది చేశారు. శుక్రవారం సాయంత్రానికి లఖింపూర్ చేరుకున్న సిద్ధూ మౌనాన్ని పాటిస్తూ దీక్షకు కూర్చున్నారు. హింసలో మరణించిన రైతు లవ్‌ప్రీత్, తరువాత జర్నలిస్ట్ రామన్ కుటుంబాలను సిద్ధూ పరామర్శించారు. నిందితుడైన కేంద్రమంత్రి కుమారుడిని అరెస్టు చేయనంత వరకు, మౌనం పాటిస్తూ తాను నిరాహార దీక్షలో కూర్చుంటానని ఆయన చెప్పారు.

లఖింపూర్‌లో మూడవసారి ఇంటర్నెట్ సేవలు బంద్..

అక్టోబర్ 3 న హింసాకాండ తర్వాత మొదటిసారిగా లఖింపూర్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. దీని తరువాత, అక్టోబర్ 5 న లఖింపూర్ ఖేరి, సీతాపూర్, బహ్రైచ్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు అక్టోబర్ 8 సాయంత్రం నుండి లఖింపూర్‌లో ఇంటర్నెట్ మళ్లీ ఆగిపోయింది.

శుక్రవారం రోజంతా ఏమి జరిగిందంటే..

  • ఢిల్లీ నుంచి మంత్రి అజయ్ మిశ్రా లక్నో చేరుకున్నారు. ఆయన తన కుమారుడు ఆశిష్‌ని సమర్థించాడు. “నా కొడుకు పారిపోలేదు, అతను అమాయకుడు” అని చెప్పారు. ఇది కాకుండా, రాజీనామా డిమాండ్ గురించి, అజయ్ మిశ్రా మాట్లాడుతూ రాజీనామా డిమాండ్ చేయడం ప్రతిపక్షాల పని అని అన్నారు.
  • శుక్రవారం లక్నోలో జరిగిన ఎంపీలు-ఎమ్మెల్యేలు, సంస్థ సమావేశానికి అజయ్ మిశ్రా హాజరయ్యారు. మరోవైపు, లఖింపూర్ హింసకు సంబంధించిన పూర్తి నివేదికను కోరుతూ జాతీయ మైనారిటీల కమిషన్ యుపి ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. కేసు 302 (హత్య) అయినప్పుడు, ఇంకా ఎందుకు అరెస్టు జరగలేదని యుపి ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు కోసం యూపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సంతృప్తి చెందలేదని సుప్రీంకోర్టు పేర్కొంది.
  • ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ బహరైచ్ వెళ్లారు. ఇద్దరు బాధిత కుటుంబాలను కలిసిన తరువాత, ఆయన వారిని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో మాట్లాడించారు. నిందితులను ఇంకా అరెస్టు చేయలేదని, దేశం మొత్తం చూస్తోందని కేజ్రీవాల్ అన్నారు. ప్రజలు చాలా కోపంగా ఉన్నారని ఆయన చెప్పారు.
  • ఎస్‌పి అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బహరైచ్‌లో ఇద్దరు బాధిత కుటుంబాలను కలిశారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా, అతని కుమారుడిని అరెస్టు చేయాలనే డిమాండ్ ఆయన లేవనెత్తారు.

ఇవి కూడా చదవండి: CM Dance: స్టెప్పులేసిన ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌.. వీడియో వైరల్

Huzurabad – Badvel: తెలంగాణ హుజురాబాద్‌.. ఆంధ్ర బద్వేల్‌ బైపోల్‌ వార్‌లో నమోదైన నామినేషన్ల చిట్టా ఇదీ.