CM Dance: స్టెప్పులేసిన ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌.. వీడియో వైరల్

సంతోషం వస్తే ఎవరైనా ఒక్కోసారి ఆపుకోలేరు. వారికి నచ్చింది చేస్తారు. మిగతా సందర్భాల్లో ఏదైనా పార్టీకి వెళ్లినప్పుడు పక్కవారు ప్రోత్సహిస్తే ఊపు వస్తుంది. ఇలా పాట పడడమో, డ్యాన్స్ చేయడమో చేస్తారు...

CM Dance: స్టెప్పులేసిన ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌.. వీడియో వైరల్
Cm
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 08, 2021 | 10:05 PM

సంతోషం వస్తే ఎవరైనా ఒక్కోసారి ఆపుకోలేరు. వారికి నచ్చింది చేస్తారు. మిగతా సందర్భాల్లో ఏదైనా పార్టీకి వెళ్లినప్పుడు పక్కవారు ప్రోత్సహిస్తే ఊపు వస్తుంది. ఇలా పాట పడడమో, డ్యాన్స్ చేయడమో చేస్తారు. కొద్ది రోజుల క్రితం కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు సింగర్‎గా అవతారమేత్తి పాట పాడారు. అరుణాచల్‌ప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన సివిల్‌ సర్వీసెస్‌ యువ అధికారులకు ఏడాది శిక్షణ ముగిసింది. వారికి ఇటీవల ముస్సోరిలోని లాల్‌బహదూర్‌శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రంలో తన పాటతో అందరినీ ఉత్సాహపరిచారు రిజిజు. ఎప్పటికప్పుడు ఫిట్‌నెస్‌ వీడియోలను పోస్ట్‌ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే రిజిజు.. తన పాటకు సంబంధించిన ఈ వీడియోని ట్విటర్‌లో పంచుకున్నారు.

తాజాగా ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌ డాన్స్‌తో అలరించారు. ఛాంద్‌ఖురైలోని మాతా కౌసల్య దేవి దేవాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి బఘేల్‌ వెళ్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత కచేరీలో ప్రఖ్యాత గాయకుడు శంకర్ మహదేవన్​ పాడిన పాటకు భూపేశ్ డ్యాన్స్ చేశారు. పార్టీ నేతలు కూడా బఘేల్‌తో కలిసి స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. అయితే ఛత్తీస్‌గఢ్‎లో సీఎం మార్పుపై పలు వార్తలు వస్తున్నాయి.

Read Also.. Marriage: అతనికి 78, ఆమెకు 79.. లేట్ వయస్సులో ఘాటు ప్రేమ.. వైరలైన పెళ్లి ఫొటోలు..