United Nations: పాకిస్థాన్ మూడు పనులు చేయాలంటూ కౌంటర్ ఇచ్చిన భారత్..
భారత్, పాకిస్థాన్ మధ్య వివాదాలు కొత్తవేం కాదు. కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ ఎప్పుడూ కూడా దొంగదెబ్బ తీయాలని ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు అంతర్జాతీయ వేదికలపై సైతం ఇండియాపై విషం కక్కుతోంది. ఇలా చేసిన ప్రతిసారి కూడా అబాసుపాలవుతునే ఉంటుంది. మన దేశ దౌత్యవేత్తల చేతిలో గట్టి దెబ్బలు తింటున్నా కూడా.. ఆ దేశ వైఖరిలో ఇప్పటికీ ఎలాంటి మార్పు కనిపించదు. అయితే తాజాగా న్యూయార్క్ ఐక్యరాజ్య సమతి 78వ సర్వ ప్రతినిధి సమావేశాల్లో పాకిస్థాన్ మరోసారి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది.

భారత్, పాకిస్థాన్ మధ్య వివాదాలు కొత్తవేం కాదు. కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ ఎప్పుడూ కూడా దొంగదెబ్బ తీయాలని ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు అంతర్జాతీయ వేదికలపై సైతం ఇండియాపై విషం కక్కుతోంది. ఇలా చేసిన ప్రతిసారి కూడా అబాసుపాలవుతునే ఉంటుంది. మన దేశ దౌత్యవేత్తల చేతిలో గట్టి దెబ్బలు తింటున్నా కూడా.. ఆ దేశ వైఖరిలో ఇప్పటికీ ఎలాంటి మార్పు కనిపించదు. అయితే తాజాగా న్యూయార్క్ ఐక్యరాజ్య సమతి 78వ సర్వ ప్రతినిధి సమావేశాల్లో పాకిస్థాన్ మరోసారి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది. అయితే దీనికి భారత్ గట్టి కౌంటర్ వేసింది. పాకిస్థాన్ చేయాల్సినటువంటి మూడు పనులు గురించి చెప్పింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధాని అయిన అన్వర్ కాకర్ ఈ ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో కశ్మీర్ విషయంపై మాట్లాడారు. అయితే దీనికి ఇండియా తన స్పందనను తెలియజేసింది.
నిరాధారమైనటువంటి ఆరోపణలు, తప్పుడు ప్రచారాలతో.. అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేయడం పాకిస్థాన్‌కు అలవాటుగా మారిపోయిందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. మానవ హక్కుల విషయంలో కూడా తన రికార్డు నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టిని పక్కకు మళ్లించేందుకే ఈ కుయుక్తులు చేస్తోందని అందరికీ తెలుసని పేర్కొంది. అలాగే జమ్మూకశ్మీర్, లఢక్, ప్రాంతాలు అనేవి భారతదేశంలోని అంతర్భాగాలేనని మేం పునరుద్ఘాటిస్తున్నామని స్పష్టం చేసింది. అక్కడి విషయాలు అనేవి మా అంతర్గతమని.. మాకు సంబంధించిన విషయాలపై మాట్లాడటానికి అసలు పాకిస్థాన్‌కు ఎటువంటి హక్కు లేదని చెప్పింది. అలాగే దక్షిణ ఆసియాలో శాంతియుత పరిస్థితులు కోసం పాకిస్థాన్ చేయాల్సిన మూడు పనులు ఉన్నాయంటూ పేర్కొంది. అయితే అందులో ఒకటి సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ప్రోత్సహించకూడదని.. అలాగే ఉగ్ర కార్యకలాపాలను నిలిపివేయాలని చెప్పింది.
ఇక రెండవది.. తన దురాక్రమణలో ఉన్నటువంటి భారత భూభాగాలను కూడా వెంటనే ఖాళీ చేయాలని తెలిపింది. అలాగే మూడవది.. పాకిస్థాన్‌లో ప్రస్తుతం కొనసాగుతున్నువంటి మైనార్టీల హక్కుల ఉల్లంఘలనను అరికట్టాలంటూ ఇలా గట్టిగా బదులు చెప్పింది. మరో విషయం ఏంటంటే.. ఇదివరకు అన్వర్ కాకర్ మాట్లాడుతూ.. ఇండియాతో పాకిస్థాన్ శాంతిని కోరుకుంటోందని అన్నారు. రెండు దేశాల మధ్య శాంతిస్థాపనకు కశ్మీర్ అంశం కీలకమని వ్యాఖ్యానించారు. అయితే ఉగ్రవాదం ఉన్నటువంటి చోట చర్చలకు తావు ఉండదని.. భారత ప్రభుత్వం ఇప్పటికే పాకిస్థాన్‌కు అనేక సార్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో జరుగుతున్న సర్వప్రతినిధి సమావేశాలకు ఇండియా తరఫున ప్రదాని నరేంద్ర మోదీ స్థానంలో కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ హజరుకానున్నారు. సెప్టెంబర్ 26 న ఆయన అక్కడ ప్రసంగం చేయనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




