India Coronavirus: దేశంలో కరోనా మృత్యుతాండవం.. పెరుగుతున్న మరణాలు.. నిన్న ఒక్కరోజే..

India Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా

India Coronavirus: దేశంలో కరోనా మృత్యుతాండవం.. పెరుగుతున్న మరణాలు.. నిన్న ఒక్కరోజే..
Corona Cases In India
Follow us

|

Updated on: Jul 31, 2021 | 11:03 AM

India Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి మళ్లీ 40వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. గురువారంతో పోల్చుకుంటే.. కేసుల సంఖ్య కొంచెం తగ్గినప్పటికీ.. మరణాల సంఖ్య మాత్రం భారీగా పెరిగింది. గత 24 గంటల్లో (శుక్రవారం) దేశవ్యాప్తంగా 41,649 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 593 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారంతో పోల్చుకుంటే.. 38 మరణాలు అధికంగా నమోదయ్యాయి. దాదాపు రెండున్నర వేల కేసులు తగ్గాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,16,13,993కి పెరగగా.. మరణాల సంఖ్య 4,23,810 కి చేరింది.

ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా కరోనా నుంచి 37,291 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,07,81,263 కి పెరిగింది. అయితే.. రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తుంది. దేశంలో ప్రస్తుతం 4,08,920 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటినుంచి ఇప్పటివరకు 46,15,18,479 కరోనా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా నిన్న 17,76,315 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. దేశంలో పాజీటివిటీ రేటు 1.29 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 97.37 శాతానికి చేరింది. మరణాల రేటు 1.34 శాతం ఉంది.

Also Read:

Students Death: స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థినులు జలసమాధి.. శోకసంద్రంలో గిరిజన కుటుంబాలు..

Viral Video: చూస్తుండగానే కుప్పకూలిన భారీ వాటర్ ట్యాంక్.. వైరల్ అవుతున్న భీకర దృశ్యాలు