రాకేష్ ఝంజువాలా ప్రాజెక్టుతో ఇక ఇండియాలో మళ్ళీ బోయింగ్ విమానాల ‘పునరుజ్జీవం’ !

Umakanth Rao

Umakanth Rao | Edited By: Phani CH

Updated on: Jul 31, 2021 | 9:47 AM

బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ ఝంజువాలా లాంచ్ చేయనున్న 'ఆకాశ ఎయిర్' ప్రాజెక్టుతో ఇక ఇండియాలో మళ్ళీ బోయింగ్ విమానాల 'పునరుద్ధరణ' జరుగుతుందని భావిస్తున్నారు.

రాకేష్ ఝంజువాలా ప్రాజెక్టుతో ఇక ఇండియాలో మళ్ళీ బోయింగ్ విమానాల 'పునరుజ్జీవం' !
Rakesh Jhunjhunwala

Follow us on

బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ ఝంజువాలా లాంచ్ చేయనున్న ‘ఆకాశ ఎయిర్’ ప్రాజెక్టుతో ఇక ఇండియాలో మళ్ళీ బోయింగ్ విమానాల ‘పునరుద్ధరణ’ జరుగుతుందని భావిస్తున్నారు. రెండేళ్లుగా జెట్ ఎయిర్ వేస్ పరిధిలోని ఈ విమానాలు ‘మూలన పడి ఉన్నాయి’. ఇండిగో, జెట్ ఎయిర్ వేస్ సంస్థల మాజీ సీఈఓల తో రాకేష్ ఝంజువాలా తన ప్రతిపాదనకు కార్యరూపం ఇవ్వనున్నారు. అపుడే డైరెక్టర్ల బోర్డును ఏర్పాటు చేశారు. దేశీయ విమాన ప్రయాణ సర్వీసులకు ఆకాశ ఎయిర్ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు. కోవిడ్ పాండమిక్ సమయంలో దేశంలో వైమానిక రంగం తీవ్ర క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈ తరుణంలో ప్రయాణికులకు చౌక ధర టికెట్ కే లభించగల ఈ విమాన ప్రయాణ సౌకర్యం వల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుందని ఈ బిలియనీర్ కి చెందిన వర్గాలు తెలిపాయి. బోయింగ్, ఎయిర్ బస్ విమానాల పునరుద్ధరణ కారణంగా దేశంలో తిరిగి ఏవియేషన్ రంగం కళకళలాడుతుందని సరిన్ అండ్ కంపెనీ మేనేజింగ్ పార్ట్ నర్ నితిన్ సరిన్ పేర్కొన్నారు.

నిజానికి బోయింగ్ కి ఇది అతి పెద్ద అవకాశమని, ఇప్పటివరకు దీనికి ముఖ్యమైన ఆపరేటర్ లభించని విషయం గమనార్హమని ఆయన అన్నారు. రాకేష్ ఝంజువాలా ప్రతిపాదనపై బోయింగ్ వర్గాలు కామెంట్ చేయనప్పటికీ.. మంచి అవకాశాలు, చర్చల కోసం తాము ఎదురు చూస్తున్నామని ఇవి రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపాయి. రాకేష్ నుంచి తమకు ఇంకా అధికారిక సమాచారమేదీ అందలేదని పేర్కొన్నాయి. ఆకాశ ఎయిర్ లో తాను 40 శాతం పెట్టుబడి పెట్టినట్టు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఇండిగో మాజీ బాస్ కూడా ఈ ప్రాజెక్టులో పది శాతం పెట్టుబడి పెడుతున్నారు. వచ్చే నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టు కార్య రూపం దాల్చనుంది.

మరిన్ని ఇక్కడ చూడండి: మావోల కొత్త పంథా..సెక్యూరిటీ దళాలపై నిఘాకు డ్రోన్లను వినియోగిస్తున్న మావోయిస్టులు.. గడ్చిరోలిలో భద్రత మరింత కట్టుదిట్టం

Nabha Natesh: లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఇస్మార్ట్ బ్యూటీ.. బాలీవుడ్ బడా హీరో సరసన నభానటేష్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu