AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మావోల కొత్త పంథా..సెక్యూరిటీ దళాలపై నిఘాకు డ్రోన్లను వినియోగిస్తున్న మావోయిస్టులు.. గడ్చిరోలిలో భద్రత మరింత కట్టుదిట్టం

మహారాష్ట్ర-ఛత్తీస్ గడ్ సరిహద్దుల్లో మావోయిస్టులు ఇంకా చురుకుగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇందుకు ఛత్తీస్ గఢ్ లోని గడ్చిరోలి జిల్లాలో భద్రతాదళాలపై నిఘాకు మావోలు ఎన్నడూ లేని విధంగా డ్రోన్లను వినియోగించడమే..

మావోల కొత్త పంథా..సెక్యూరిటీ దళాలపై నిఘాకు డ్రోన్లను వినియోగిస్తున్న మావోయిస్టులు.. గడ్చిరోలిలో భద్రత మరింత కట్టుదిట్టం
Maoists Using Drones
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jul 31, 2021 | 9:44 AM

Share

మహారాష్ట్ర-ఛత్తీస్ గడ్ సరిహద్దుల్లో మావోయిస్టులు ఇంకా చురుకుగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇందుకు ఛత్తీస్ గఢ్ లోని గడ్చిరోలి జిల్లాలో భద్రతాదళాలపై నిఘాకు మావోలు ఎన్నడూ లేని విధంగా డ్రోన్లను వినియోగించడమే.. మహారాష్ట్ర.ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని పోలీసు ఔట్ పోస్టుల వద్ద పోలీసు స్టేషన్ల వద్ద డ్రోన్లను తాము కనుగొన్నట్టు గడ్చిరోలి డీఐజీ సందీప్ పాటిల్ తెలిపారు. గత నాలుగైదు నెలలుగా జరిగిన ఈ విధమైన ఏడెనిమిది ఉదంతాలు తమ దృష్టికి వచ్చాయని ఆయన చెప్పారు. ముఖ్యంగా గడ్చిరోలి లోని వెంకటాపూర్, గోండియా ప్రాంతాల్లో డ్రోన్లు కనిపించినట్టు ఆయన చెప్పారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు భద్రతాదళాల వారు, పోలీసులు ప్రతి చర్యలు చేపడుతున్నారని, డ్రోన్లను నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నారని ఆయన వెల్లడించారు. అయితే ఇవి పేలోడ్లను తీసుకువెళ్లేంత అధునాతనమైనవి కావన్నారు. ఏమైనా దీన్ని తాము సీరియస్ గా పరిగణిస్తున్నట్టు ఆయన చెప్పారు. చిన్నపాటి వీడియోలను తీసుకునేందుకు నక్సలైట్లు వీటిని వినియోగిస్తున్నారని సందీప్ పాటిల్ పేర్కొన్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. డ్రోన్లను నివారించేందుకు, వీటిని నిర్వీర్యం చేసేందుకు హైదరాబాద్ నుంచి ఆపరేటింగ్ ప్రొసీజర్లను సేకరిస్తున్నట్టు తెలుస్తోందని, దీనిపై ఇంకా సమగ్ర సమాచారం తెలియాల్సి ఉందని ఆయన అన్నారు. అలాగే మందుపాతరలను ముందుగానే కనిపెట్టే సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సేకరిస్తున్నామన్నారు. ఇలా ఉండగా ఓ నక్సల్ జంట నిన్న పోలీసులకు లొంగిపోయింది. ఈ భార్యాభర్తలపై 8 లక్షల రూపాయల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. వీరికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం కల్పించడం జరుగుతుందన్నారు. 2019-2021 మధ్య (ఇప్పటివరకు) 43 మందికి పైగా మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగిపోయారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Tokyo Olympics 2020 Live Updates: ఒలంపిక్స్ లో సంచలన విజయం నమోదు.. డిస్కస్‌ త్రో ఫైనల్లో కమల్‌ప్రీత్‌ కౌర్‌

Viral Video: గొడుగుతో బ్రిటన్ ప్రధాని కుస్తీ..!! నెట్టింట తెగ వైరల్.. వీడియో