Students Death: స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థినులు జలసమాధి.. శోకసంద్రంలో గిరిజన కుటుంబాలు..

Andhra Pradesh Crime News: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో విషాదం నెలకొంది. స్నానానికి వెళ్లి నేల బావిలో పడి ఇద్దరు గిరిజన విద్యార్థినులు జలసమాధి

Students Death: స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థినులు జలసమాధి.. శోకసంద్రంలో గిరిజన కుటుంబాలు..
Crime News
Follow us

|

Updated on: Jul 31, 2021 | 9:31 AM

Andhra Pradesh Crime News: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో విషాదం నెలకొంది. స్నానానికి వెళ్లి నేల బావిలో పడి ఇద్దరు గిరిజన విద్యార్థినులు జలసమాధి అయ్యారు. ఈ విషాద సంఘటన జిల్లాలోని భామిని మండలం కోటకొండ గిరిజన గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందన పి. కీర్తికి (12), ఎ.అంజలి (13) శుక్రవారం స్నానం చేసేందుకు గ్రామంలోని ఓ బావి దగ్గరకు వెళ్లారు. అనంతరం స్నానానికి దిగి బావిలో పడి మరణించారు. అనంతరం గమనించిన గ్రామస్థులు బావిలోనుంచి బాలికల మృతదేహాలను బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భామిని ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

మృతిచెందిన బాలికలిద్దరూ స్నేహితులు. ఇద్దరు కూడా విజయనగరం జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. కరోనా కారణంగా పాఠశాలలకు సెలవు కావడంతో ఇద్దరూ గ్రామ శివార్లలోని నేల బావిలో స్నానానికి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతిచెందినట్లు వివరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరు బాలికలు మృతిచెందడంతో.. వారి తల్లి దండ్రులు శోకసంద్రంలో మునిగారు. కోటకొండలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read:

AP Road Accident: కాసేపట్లో ఇంటికి చేరుతారనగా.. దూసుకొచ్చిన మృత్యువు.. ఇద్దరు దుర్మరణం.. 

Police Beat: మాస్కు ధరించకపోతే కాలితో తన్నాలా.? తీవ్ర విమర్శలకు దారి తీస్తోన్న నెల్లూరు ఎస్‌ఐ తీరు..

మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..