ఉపాధ్యాయుల కృషికి గుర్తింపు.. ఆరో స్థానంలో భారత్‌

ఉపాధ్యాయులకు గుర్తింపు ఇవ్వడం, వారిని గౌరవించడంలో భారత్‌ ఆరో స్థానంలో నిలిచింది. బ్రిటన్‌కు చెందిన వార్కీ ఫౌండేషన్‌ ప్రపంచవ్యాప్తంగా

  • Updated On - 11:14 am, Tue, 27 October 20 Edited By:
ఉపాధ్యాయుల కృషికి గుర్తింపు.. ఆరో స్థానంలో భారత్‌

India Teachers Survey: ఉపాధ్యాయులకు గుర్తింపు ఇవ్వడం, వారిని గౌరవించడంలో భారత్‌ ఆరో స్థానంలో నిలిచింది. బ్రిటన్‌కు చెందిన వార్కీ ఫౌండేషన్‌ ప్రపంచవ్యాప్తంగా 35 దేశాల్లో గత వారం ఓ సర్వే నిర్వహించింది. అందులో భాగంగా మీ టీచర్లను మీరు విశ్వసిస్తున్నారా? మీలో టీచర్లు స్ఫూర్తిని నింపుతున్నారా? మీ టీచర్లు ప్రజ్ఞావంతులా..? వంటి వెయ్యి ప్రశ్నలను సంధించారు.

ఇక ఆ సర్వేలో టీచర్లకు గుర్తింపు ఇవ్వడంలో చైనా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత ఘనా, సింగపూర్, కెనడా, మలేసియా, భారత్‌ దేశాలు నిలిచాయి. ఈ సందర్భంగా వార్కీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సన్నీ వార్కీ మాట్లాడుతూ.. టీచర్లను గౌరవించడం మన నైతిక బాధ్యత అని అన్నారు.

Read More:

అవి లేకుండా అన్నయ్యను నేనే చూడలేదు.. ఫ్యాన్స్‌కి వినాయక్ భరోసా

Bigg Boss 4: అభి, అఖిల్‌ మధ్య మొదలైన స్నేహం