National News: దేశవ్యాప్తంగా అనూహ్య ఘటనలు.. విశేష సంఘటనల సమాహారం. నేషనల్ రౌండప్

జమ్ములో ఉగ్రవాదులు తెగబడ్డారు. శ్రీనగర్‌ శివారులోని హవాలాలో జరిపిన కాల్పుల్లో ఓ స్ట్రీట్‌ వెండర్‌ చనిపోయాడు.

National News: దేశవ్యాప్తంగా అనూహ్య ఘటనలు.. విశేష సంఘటనల సమాహారం. నేషనల్ రౌండప్
National Round Up
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 06, 2021 | 8:58 AM

National News Around India: జమ్ములో ఉగ్రవాదులు తెగబడ్డారు. శ్రీనగర్‌ శివారులోని హవాలాలో జరిపిన కాల్పుల్లో ఓ స్ట్రీట్‌ వెండర్‌ చనిపోయాడు. మరో ఘటనలో ప్రముఖ కశ్మీరీ పండిట్​ మఖన్​ లాల్​ బింద్రో సహా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం చామోలిలోని నేషనల్‌ హైవేపై కొండ చరియలు విరిగి పడ్డాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఓవర్‌ లుక్‌లో వచ్చిన ఓ వాహనం బండ రాళ్లను ఢీ కొట్టడంతో ప్రమాదానికి గురయింది.

వెస్ట్‌బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. బిర్భూమ్‌లోని తిల్పరా బ్యారేజ్‌, మస్సంజోర్‌ డ్యామ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు గేట్లు పైకి ఎత్తి నీటిని బయటకు వదులుతున్నారు.

పాండిచెరీలో వానలు దంచి కొడుతున్నాయి. నైతు రుతుపవనాలు వెళ్లిపోయిన తర్వాత ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి సూచకంగా ఈ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో పలు చోట్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

దేశ వ్యాప్తంగా ఇవాళ్టీ నుంచి దుర్గా పూజలు మొదలవుతున్నాయి. యూపీలోని వారణాసీలో అమ్మవారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భక్తులు. అటు వెస్ట్‌ బెంగాల్‌లోనూ మహాకాళీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అంతా సిద్ధమయింది.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించే ఇళ్లలో 80 శాతం మహిళలకే ఇస్తున్నామన్నారు పీఎం మోదీ. లేదంటే మహిళలను సమయజమానులుగా చేర్చామని వెల్లడించారు. UPలో నిర్మించిన 75 వేల ఇళ్ల తాళాలను ఆయన లబ్దిదారులకు అందించారు.

యూపీ లఖింపూర్‌కు వెళ్లేందుకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సిద్ధమయ్యారు. ఇవాళ రాహుల్‌ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల టీమ్‌ రైతులను పరామర్శించనుంది. పోలీసులు అనుమతి ఇవ్వకున్నా వెళ్లి తీరాలని నిర్ణయం తీసుకున్నారు.

పంజాబ్‌కు ఉన్న ఇంటర్నేషనల్‌ బోర్డర్స్‌ను మూసి వేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కోరారు.. పంజాబ్‌ సీఎం ఛరన్‌జిత్‌ సింగ్‌. విదేశాల నుంచే రాష్ట్రానికి డ్రగ్స్‌ డంప్‌ అవుతోందని అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలోకి డ్రగ్‌ సరఫరాను నియంత్రించాలన్నారు.

దేశంలో 15 మంది జడ్జీలను ట్రాన్స్‌ఫర్‌ చేసింది సుప్రీం కోర్టు. తెలంగాణ హైకోర్టులో ఉన్న MSS రామచంద్రరావును పంజాబ్‌ హైకోర్టుకు బదిలీ చేయగా.. బాంబే హైకోర్టు జడ్జీ ఉజ్జల్‌ బయ్యాన్‌ను హైదరాబాద్‌కు బదిలీ చేశారు. ఏపీకి కూడి ఇద్దరు జడ్జీలు వచ్చారు.

శివసేన MP సంజయ్‌ రౌత్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య కీలక చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. త్వరలో జరిగే యూపీ ఎన్నికలపై ప్రధనంగా టాక్స్‌ నడిచినట్టు ప్రచారం జరుగుతోంది. రౌత్‌ మాత్రం భేటీకి ప్రధాన్యత లేదంటూ వెళ్లిపోయారు.

అసోంలోని కరీంగంజ్‌ జిల్లాలో ఓ వంతెన కుప్పుకూలింది. నదిపై వేలాడే వంతెన కూలిపోవడం వల్ల 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. రాటాబరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చెరాగి ప్రాంతంలో ఉన్న చెరాగి- సింగ్లా వంతెన కూలిపోయింది.

రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌తో డిఫెన్స్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ భేటీ అయ్యారు. ప్రెసిడెంట్‌ పిలుపు మేరకు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన బిపన్‌ పలు రక్షణ అంశాలపై చర్చించారు. సరిహద్దులో చైనా సాగిస్తున్న చర్యలపై వివరించారు.

యూపీలో చనిపోయిన రైతుల మృతికి BJP ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు కిసాన్‌ మెర్చా నేత టికాయత్‌. లఖీంపూర్‌కు వచ్చిన ఆయన మృతుల కుటుంబాలను పరామర్శించారు.

యూపీ హింసాకాండపై ఆందోళనలు కొనసాగుతూనే ఉంది. ఘటనకు కారణమైన కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడిని నేడు ఆరెస్ట్‌ చేయాలని పంజాబ్‌ PCC అధ్యక్షులు సిద్ధూ వార్నింగ్‌ ఇచ్చారు. లేనిపక్షంలో ఛలో లఖింపూర్‌కు తప్పదన్నారు.

లఖింపూర్‌ వెళ్లకుండా నేతలను అడ్డుకుంటూనే ఉన్నారు అధికారు. సీఎంలను, MPలను ఎవరిని కూడా వెళ్లకుండా పోలీసులు కట్టడి చేస్తున్నారు. లక్నోకి వచ్చిన చత్తీస్‌ఘడ్‌ సీఎం భూపేష్‌ బగేల్‌ను యూపీ పోలీసులు అడ్డుకున్నారు.

అటు కాల్పుల్లో మృతి చెందిన ఫ్యామిలీస్‌కి అధికారులు ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం ప్రకటించిన 45 లక్షల రూపాయలను.. మృతుల కుటుంబాలకు అందజేశారు. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి ప్రత్యేకంగా చెక్కులు ఇచ్చారు.

పంజాబ్‌ వ్యాప్తంగా NSUI విద్యార్థి సంఘాలు క్యాండిల్‌ ర్యాలీని నిర్వహించాయి. మృతులకు నివాళులు అర్పిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. కేంద్ర మంత్రిని, ఆయన కొడుకును అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

చెన్నై , తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలో కుండపోత వానలు కురుస్తున్నాయి. చెన్నైలో కురిసిన భారీ వర్షానికి పలు ముంపు ప్రాంతాలు నీట మునిగాయి. రాయపురం , మైలాపూర్ , మౌంట్ రోడ్డు ప్రాంతాలలో భారీగా కురుస్తున్నాయి.

ఇంగ్లాండ్‌లోని బర్మింగ్​హామ్​ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న కామన్వెల్త్​ క్రీడల్లో హాకీ పోటీల నుంచి భారత్‌ తప్పుకుంది. కొవిడ్ ఆందోళనలు సహా భారత ప్రయాణికులపై యూకే వివక్షపూరిత క్వారంటైన్ నిబంధనలే అందుకు కారణమని హాకీ ఇండియా తెలిపింది.

Read also: Modi Cabinet Ministers Assets: మోదీ కేబినెట్లో స్మార్ట్ ఇన్వెస్టింగ్ మినిస్టర్స్.. ప్రధాని రూటు సెపరేటు. ఎవరెవరి ఆస్తులు ఎంతెంత పెరిగాయంటే.?