Hilarious: గడసరి పిల్లగాడు.. అమ్మపైనే కంప్లైంట్ ఇచ్చాడు.. కారణం విని కడుపుబ్బా నవ్వి వెళ్లిన ఖాకీలు..

ఈ కాలపు పిల్లలు మహా ముదుర్లు అవుతున్నారు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా.. వారు చూడటానికి చిన్నపిల్లలు అయినప్పటికీ.. విషయ పరిజ్ఞానం మాత్రం చాలానే ఉంటుంది.

Hilarious: గడసరి పిల్లగాడు.. అమ్మపైనే కంప్లైంట్ ఇచ్చాడు.. కారణం విని కడుపుబ్బా నవ్వి వెళ్లిన ఖాకీలు..
Boy Complaint On Parents
Follow us

|

Updated on: Jan 06, 2023 | 4:50 PM

ఈ కాలపు పిల్లలు మహా ముదుర్లు అవుతున్నారు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా.. వారు చూడటానికి చిన్నపిల్లలు అయినప్పటికీ.. విషయ పరిజ్ఞానం మాత్రం చాలానే ఉంటుంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌లో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ వెలుగు చూసింది. గడసరి పిల్లాడు చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా.. నవ్వు తెప్పిస్తోంది. ఇంతకీ ఆ పిల్లాడు ఏం చేశాడు. అంతటి ఘనకార్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

హపూర్‌లోని గర్‌ముక్తేశ్వర్‌లో తొమ్మిదేళ్ల చిన్నారి.. తన తల్లిదండ్రులపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. వాడిని చూసిన పోలీసులు తొలుత కంగారుపడినా.. ఆ తరువాత మ్యాటర్ ఏంటా? అని ఆరా తీస్తే కడుపుబ్బా నవ్వుకున్నారు. ఇంత చలిలో తనను చన్నీళ్లతో స్నానం చేయమంటోందంటూ తన తల్లిపై పిల్లాడు కంప్లైంట్ ఇవ్వగా.. తనకు నచ్చిన హెయిర్ స్టైల్ చేయించడం లేదంటూ నాన్నపై ఫిర్యాదు చేశాడు. వాడు చెప్పిన విధానానికి అవాక్కైన పోలీసులు.. కాసేపు నవ్వుకున్నారు. అనంతరం వాడిని శాంతిపజేశారు.

అక్కాపూర్ గ్రామానికి చెందిన పిల్లాడికి(9) తన తండ్రి హెయిర్ కటింగ్ చేయించాడు. అయితే, న్యూ స్టైల్‌ హెయిర్ కటింగ్ చేయించుకుంటానంటే తండ్రి ఒప్పుకోలేదు. దాంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు బాలుడు. ఇక ఇంటికి వచ్చాక తల్లి స్నానం చేయమంటూ బలవంతం పెట్టింది. చలి పెడుతుందని, తరువాత చేస్తానని చెప్పినా వినకుండా స్నానం చేయాలంటూ బాలుడిని కోరింది. తీవ్రమైన చలిలో చన్నీళ్లతో స్నానం చేయాలనడంతో విసిగిపోయిన బుడ్డోడు నేరుగా డయల్ 112 కి కాల్ చేశాడు. విషయం ఏంటి అని పోలీసులు అడగగా.. పిల్లాడిని అని కూడా చూడకుండా తనను వేధిస్తున్నారని, మీరు తక్షణమే రావాలంటూ అడ్రస్ కూడా చెప్పాడు.

ఇవి కూడా చదవండి

ఏం జరిగిందోనని ఆందోళనలో పోలీసులు హుటాహుటిని పిల్లాడి ఇంటికి వెళ్లారు. ఆ పిల్లాడి వద్దకు వెళ్లి అసలేంటి సంగతి అని ఆరా తీశారు. ఇంకేముంది.. చావు కబురు చల్లగా చెప్పినట్లు సిల్లీ విషయాన్ని చాలా సీరియస్‌గా చెప్పేశాడు తన పసి మనస్తత్వంతో. అది విన్న పోలీసులు ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఆ తరువాత పిల్లాడిని శాంతింపజేశారు. మంచి లక్షణాలు అలవర్చడానికి తల్లిదండ్రులు ఇలా చెప్తారని, వారు చెప్పింది విని నడుచుకుంటే.. మంచి వ్యక్తి అవుతారని సముదాయించారు. దాంతో ఆ బుడ్డోడు కాస్త కూల్ అయ్యాడు. ఇక చిన్నారి తల్లిదండ్రులకు కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లల పట్ల అలా కఠినంగా ఉండొద్దని, ఏదైనా సరే సముదాయిస్తూ చెప్పాలని సూచించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు పోలీసులు. అయితే, ఊళ్లోకి పోలీసులు ఒక్కసారిగా రావడంతో.. గ్రామస్తులు, ఇరుగు పొరుగు వారు షాక్ అయ్యారు. చివరకు విషయం తెలుసుకుని వారు కూడా ఫుల్లుగా నవ్వుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు