ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్ ఎలా అందుతోంది ? కేంద్రంపై ఢిల్లీ ప్రభుత్వం మండిపాటు, ..డేటా ఇవ్వాలని డిమాండ్
ఓ వైపు దేశంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉండగా మరోవైపు ప్రైవేటు ఆస్పత్రులకు ఇది ఎలా పుష్కలంగా అందుతోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రశ్నించారు. కేంద్రం ఈ విషయంలో మిస్ మేనేజ్ మెంట్ కి పాల్పడుతోందని,
ఓ వైపు దేశంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉండగా మరోవైపు ప్రైవేటు ఆస్పత్రులకు ఇది ఎలా పుష్కలంగా అందుతోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రశ్నించారు. కేంద్రం ఈ విషయంలో మిస్ మేనేజ్ మెంట్ కి పాల్పడుతోందని, చూడబోతే కావాలనే ఇలా చేస్తునట్టు కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రైవేటు హాస్పిటల్స్ కి వ్యాక్సిన్ అందిస్తూ స్టాక్ లేదని రాష్ట్రాలకు చెప్పడమేమిటన్నారు. నగరంలో 18-44 వయస్కులు సుమారు 92 లక్షల మంది ఉన్నారని, వారికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే 1.84 కోట్ల డోసుల టీకామందు అవసరమవుతుందని ఆయన చెప్పారు. కానీ కేంద్రం ఏప్రిల్ లో 4.5 లక్షల డోసులు, ఈ మే నెలలో మరీ తక్కువగా 3.67 లక్షల డోసులు మాత్రమే ఇచ్చిందని, ఇది చాలా విడ్డూరంగా ఉందని ఆయన చెప్పారు. జూన్ 10 కి ముందే 5.5 లక్షల డోసుల స్టాక్ మాత్రం ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, అందుకే రాష్ట్రాలకు, ప్రైవేటు రంగానికి ఎన్ని డోసులు ఇస్తున్నారో అందుకు సంబంధించిన డేటా షేర్ చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని మనీష్ సిసోడియా పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రం ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. మీ కారణంగా మా ప్రభుత్వం 18-44 ఏళ్ళ మధ్య వయస్సువారికి వ్యాక్సిన్ ఇవ్వడం మానివేసిందని, అంతకు ముందు.. మే 1 నుంచి దేశ వ్యాప్తంగా ఈ వయస్కులకు టీకామందు ఇస్తామని ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న ప్రభుత్వం ఇప్పుడు మౌనంగా ఉండడం ఏమిటని కూడా ఆయన ప్రశ్నించారు.
కోవిద్ వ్యాక్సిన్ల పైన, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లపైనా జీరో జీ ఎస్టీ ఉండాలని తాను నిన్నటి జీ ఎస్టీ సమావేశంలో డిమాండు చేసిన విషయాన్ని సిసోడియా గుర్తు చేశారు. కాగా…. ఢిల్లీలో గత 24 గంటల్లో 956 కోవిద్ కేసులు నమోదయ్యాయి. సోమవారం నుంచి దశలవారీగా ఆంక్షలు సడలించే సూచనలు కనిపిస్తున్నాయి.
మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ :కర్నూలులో మరో రెండు వజ్రాలు లభ్యం..వర్షం పడితే వజ్రాలే.. జోరందుకున్న వేట : Diamonds In Kurnool Video