AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: ప్రభుత్వం సోషల్ మీడియా పోస్టులకు రెడ్ టిక్ పెట్టేస్తోంది..అంటూ వస్తున్న పోస్టుల్లో నిజమెంత? తెలుసుకోండి!

Fact Check: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన సోషల్ మీడియా కొత్త రూల్స్ ను ఊటంకిస్తూ ఈ పోస్ట్ ఫార్వార్డ్ చేస్తున్నారు చాలా మంది.

Fact Check: ప్రభుత్వం సోషల్ మీడియా పోస్టులకు రెడ్ టిక్ పెట్టేస్తోంది..అంటూ వస్తున్న పోస్టుల్లో నిజమెంత? తెలుసుకోండి!
Fact Check
KVD Varma
|

Updated on: May 29, 2021 | 8:32 PM

Share

Fact Check: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన సోషల్ మీడియా కొత్త రూల్స్ ను ఊటంకిస్తూ ఈ పోస్ట్ ఫార్వార్డ్ చేస్తున్నారు చాలా మంది. ఈ పోస్టులో సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్ ఫాంలో ఉన్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలు పెట్టిందని పేర్కొంటున్నారు. వాట్సప్ లో మన పోస్టుల వద్ద మూడు రెడ్ టిక్స్ వస్తే కోర్టు మనకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టినట్టు అర్ధం అని ఆ పోస్టులో చెబుతున్నారు. అదేవిధంగా రెండు బ్లూ టిక్ లు ఒక రెడ్ టిక్ వస్తే ప్రభుత్వం మనమీద చర్యలు తీసుకుంటుంది. ఇలా వాట్సప్ ద్వారా అనేక సార్లు ఈ మెసేజ్ ఫార్వార్డ్ చేస్తుంది. ఇది చూసిన చాలా మంది భయపడుతున్నారు. అయితే, అటువంటిది ఏమీ లేదు.

వాట్సప్ లో అటువంటి ఏర్పాటు ఏమీ జరగలేదు. ఈ మెసేజ్ పూర్తిగా తప్పు. ప్రస్తుతం మెసేజ్ పంపినట్లుగా ఒక బూడిద రంగు టిక్, అది అవతలి వారికి చేరినట్టుగా రెండు బూడిద రంగు టిక్స్.. వారు మెసేజ్ చదివారు అని తెలియడానికి రెండు బ్లూ కలర్ టిక్స్ వస్తాయి. వీటిని మించి టిక్ లు రెడ్ లోనో ఇంకో రంగులోనొ వచ్చే అవకాశమే లేదు. ఇందుకు సంబంధించి వాట్సప్ ఎటువంటి మార్పులూ చేయలేదు. ఈ విషయాన్ని అందరూ గ్రహించాల్సి ఉంది.

సోషల్ మీడియా కు సంబంధించిన కొత్త ఐటి నిబంధనలపై వాట్సాప్, కేంద్ర ప్రభుత్వం న్యాయ పోరాటంలో చిక్కుకున్నప్పటికీ, ఇప్పుడు వైరల్ గా మారిన ఈ సందేశం పూర్తిగా తప్పుడు వాదనలతో నిండి ఉంది.ఫేస్బుక్ యాజమాన్యంలోని యాప్ సందేశాలు, కాల్స్ కోసం కొత్త కమ్యూనికేషన్ నియమాలను తీసుకువచ్చిందని, రెండింటినీ ప్రభుత్వ పరికరాలకు నిరంతరం కనెక్ట్ చేయడానికి వీలు కల్పిస్తుందని వైరల్ సందేశం తప్పుగా పేర్కొంది. కొత్త వ్యవస్థ కింద చట్టాన్ని అమలు చేసే అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సందేశాలు, వీడియోలను పోస్ట్ చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవచ్చని సందేశంలో పేర్కొంది. కానీ, ఇది పూర్తిగా అబద్ధం. వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌లోని సందేశాలు ఎండ్-టు-ఎండ్ గుప్తీకరించబడ్డాయి.

అంటే.. సందేశం పంపిన వారికీ.. అందుకున్న వారికీ తప్ప మరెవరికీ ఈ సందేశాలు చూసే వీలు ఉండదు. ఇక్కడ మూడవ పార్టీలు ఏవైనా కానీయండి అలాగే వాట్సప్ లేదా దాని మాతృ సంస్థ ఫేస్‌బుక్ కూడా ఈ మధ్య ఉన్న కంటెంట్‌ను యాక్సెస్ చేయలేవు. వాట్సాప్‌లో నకిలీ క్లెయిమ్‌లను ఫార్వార్డ్ చేయవద్దని వినియోగదారులకు వాట్సప్ సంస్థ సూచిస్తోంది.

Also Read: Naval Chief: యుద్ధ స్వభావం మారుతోంది..సాయుధ దళాలు ఉమ్మడిగా పోరాడాల్సిన తరుణం ఇది.. నేవల్ చీఫ్ ఎడ్మిరల్ సింగ్

Rajasthan: రాజస్థాన్ ప్రభుత్వ భారీ ఆలోచన..30 కోట్ల ఔషధ మొక్కల పంపిణీకి ప్రయత్నాలు