ముంబైలోని మెహుల్ చోక్సీ ఇంటి ముందు ‘గుట్టలుగా’ నోటీసుల వెల్లువ.., ఇండియాకు అప్పగింత ఎప్పుడో మరి ..?
ప్రస్తుతం డొమినికా పోలీసుల అదుపులో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని ఇండియాకు ఎప్పుడు అప్పగిస్తారో తెలియదు. తాను ఇంతకాలం శరణు జొచ్చిన ఆంటిగ్వా నుంచి రహస్యంగా క్యూబాకు వెళ్తూ మధ్యలో డొమినికా పోలీసులకు పట్టుబడిన చోక్సీ..
ప్రస్తుతం డొమినికా పోలీసుల అదుపులో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని ఇండియాకు ఎప్పుడు అప్పగిస్తారో తెలియదు. తాను ఇంతకాలం శరణు జొచ్చిన ఆంటిగ్వా నుంచి రహస్యంగా క్యూబాకు వెళ్తూ మధ్యలో డొమినికా పోలీసులకు పట్టుబడిన చోక్సీ..అప్పగింత వ్యవహారం ఇంకా సాగుతోంది. కాగా ముంబైలోని ఆయన ఇంటి ఎంట్రన్స్ లో మాత్రం నోటీసులు ‘గుట్టలుగా’ దర్శనమిస్తున్నాయి. బ్యాంకులు, కోర్టులు, సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు 2019 నుంచి ఆయన కోసం జారీ చేసిన నోటీసులివి.. ఒకదానికొకటి ‘పోటీ’ పడుతున్నట్టు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకును సుమారు 13,500 కోట్ల మేర ఛీట్ చేసిన నేరంలో తన బంధువు నీరవ్ మోడీతో బాటు ఇండియా నుంచి పరారయ్యాడు నీరవ్ లండన్ జైల్లో శిక్ష అనుభవిస్తుండగా చోక్సి మాత్రం ఆంటిగ్వా వెళ్లి ఆ దేశ పొరసత్వం పొందాడు. అక్కడ రెండు కేసులు ఎదుర్కొంటున్నాడు. గత ఆదివారం క్యూబా వెళ్లాలనుకుని మధ్యలో డొమినికా పోలీసులకు పట్టుబడగా వారు కేసు పెట్టారు. అతని తరఫు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై కోర్టు జూన్ 2 న విచారణ జరపనుంది.
తన క్లయింటును ఇండియాకు అప్పగించకుండా చూడాలని ఆయన తరఫు లాయర్ కోర్టును కోరుతున్నాడు. అసలు మా క్లయింటు భారత ఫౌరుడే కాదని, తన భారత పౌరసత్వాన్ని వదులుకున్నాడని ఆ లాయర్ వాదిస్తున్నాడు. ఇండియాలోని చోక్సి తరఫు లాయర్ కూడా ఇలాగే అంటున్నాడు. అయితే ఆంటిగ్వా అతడిని సాధ్యమైనంత త్వరగా ఇండియాకు అప్పగించాలని అంటోంది. తమ దేశానికి అతగాడు అప్రదిష్ట తెచ్చిపెట్టాడని ఆ దేశ ప్రధాని ఆరోపిస్తున్నారు. నేరుగా అతడ్ని భారత దేశానికి పంపాలని ఆయన సూచిస్తున్నాడు.
మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ :కర్నూలులో మరో రెండు వజ్రాలు లభ్యం..వర్షం పడితే వజ్రాలే.. జోరందుకున్న వేట : Diamonds In Kurnool Video