ఆగస్టు 20…నాడే చిద్దూకు చుక్కెదురు !
ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరానికి అసలు ఈ నెల 20 నే చుక్కెదురైంది. ఈ కేసులో తనను ఈడీ అరెస్టు చేయకుండా చూడాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ని ఢిల్లీ హైకోర్టు ఆనాడే తోసిపుచ్చింది. దీనితో ఈ కేసు దర్యాప్తులో ఆ రోజు నుంచే సీబీఐ, ఈడీ లకు ఫ్రీ హాండ్ లభించినట్టయింది. పైగా కోర్టు.. చిదంబరం పట్ల వాడిన పదజాలం కఠినంగా ఉంది. ” […]
ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరానికి అసలు ఈ నెల 20 నే చుక్కెదురైంది. ఈ కేసులో తనను ఈడీ అరెస్టు చేయకుండా చూడాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ని ఢిల్లీ హైకోర్టు ఆనాడే తోసిపుచ్చింది. దీనితో ఈ కేసు దర్యాప్తులో ఆ రోజు నుంచే సీబీఐ, ఈడీ లకు ఫ్రీ హాండ్ లభించినట్టయింది. పైగా కోర్టు.. చిదంబరం పట్ల వాడిన పదజాలం కఠినంగా ఉంది. ” కింగ్ పిన్ ‘, ‘ కీ కాన్సిపిరేటర్ ‘ (ముఖ్య కుట్రదారు),’ మెయిన్ అక్యూజ్డ్’ (ప్రధాన నిందితుడు), అనే తీవ్ర పదజాలాన్ని వినియోగించింది. దీంతో చిదంబరం అదే రోజు సాయంత్రం 4. 30 గంటల ప్రాంతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పటికే విచారణ ముగియడంతో.. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అధికారులు.. మీ వాదనను మరుసటిరోజు అంటే బుధవారం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ముందు వినిపించాలని చిదంబరం తరఫు లాయర్లను కోరారు. గత బుధవారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో చిదంబరం న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్విసల్మాన్ ఖుర్షీద్ తదితరులు- ఇది అత్యవసర కేసు అని, విచారణ త్వరగా జరగాలంటూ జస్టిస్ ఎన్. వి. రమణ ‘ శరణు జొచ్చారు. ‘ (అప్పుడు చీఫ్ జస్టిస్ గొగోయ్ అయోధ్య కేసును విచారిస్తున్నారు). చీఫ్ జస్టిస్ తరువాత జస్టిస్ రమణ సీనియర్ న్యాయమూర్తి.. రూల్స్ ప్రకారం ఈయన కేసును విచారించవచ్చు. కానీ చిదంబరం కేసులో విచారణను ఆయన నిరాకరించారు. ఆగస్టు 21 న లంచ్ అనంతరం ప్రధాన న్యాయమూర్తి ఈ కేసును విచారిస్తారని ఆయన కపిల్ సిబల్ ప్రభృతులకు చెప్పారు. కానీ లంచ్ అనంతరం కూడా ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ అయోధ్య కేసు విచారణను కొనసాగించారు. దీంతో జస్టిస్ రమణ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అధికారులను పిలిపించారు. ఈ పిటిషన్ లిస్టులో ఉందా అని ప్రశ్నించారు. ఇందుకు.. చిదంబరం కేసుకు సంబంధించి డాక్యుమెంట్లలో కొన్ని పొరబాట్లు ఉన్నాయని, ఆ తప్పులను సరిదిద్దామని వారు ఆయనకు చెప్పారు.
చిదంబరం పిటిషన్ విచారణకు సిధ్ధంగా ఉందన్నారు. చివరకు ఆగస్టు 26 న (సోమవారం) చిదంబరం పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం విచారించింది. న్యాయమూర్తులు ఆర్. భానుమతి, ఎ. ఎన్. బొపన్నలతో కూడిన బెంచ్ ముందు ఇది విచారణకు వచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఇఛ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని, ఇదివరకే చిదంబరం అరెస్టులో ఉన్నారు గనుక..ఇక ఈ పిటిషన్ ను విచారించి కూడా ప్రయోజనం లేదని అంటూ ఆయన పిటిషన్ ను డిస్మిస్ చేసింది.