నక్సలిజంపై ఉక్కు పాదం.. నడుం బిగించిన కేంద్రం

దేశంలో మావోయిజాన్ని శాశ్వతంగా రూపు మాపేందుకు కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక రచిస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అమిత్‌షా నక్సలిజం నిర్మూలనే తన తరువాతి అజెండాగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉగ్రవాదం తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సవాల్‌గా మారిన నక్సలిజం సమస్యకు శాశ్వత పరిష్కారమార్గాన్ని ఈ మీటింగ్ ద్వారా చూపాలని భావిస్తున్నారు. దేశ భద్రత దృష్టితోనే కాకుండా…ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని […]

నక్సలిజంపై ఉక్కు పాదం.. నడుం బిగించిన కేంద్రం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 26, 2019 | 3:33 PM

దేశంలో మావోయిజాన్ని శాశ్వతంగా రూపు మాపేందుకు కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక రచిస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అమిత్‌షా నక్సలిజం నిర్మూలనే తన తరువాతి అజెండాగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉగ్రవాదం తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సవాల్‌గా మారిన నక్సలిజం సమస్యకు శాశ్వత పరిష్కారమార్గాన్ని ఈ మీటింగ్ ద్వారా చూపాలని భావిస్తున్నారు. దేశ భద్రత దృష్టితోనే కాకుండా…ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లడం వలన మెరుగైన ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. ఈ సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ హాజరవ్వగా, తెలంగాణ నుంచి హోం మంత్రి మహమూద్‌ అలీ పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిశా, ఝార్ఖండ్‌ తదితర 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమిత్‌షా ఈ సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి.